iDreamPost
android-app
ios-app

మెగా ప్రిన్సెస్ క్లీంకారకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన Jr.NTR!

  • Author Soma Sekhar Published - 11:43 AM, Wed - 19 July 23
  • Author Soma Sekhar Published - 11:43 AM, Wed - 19 July 23
మెగా ప్రిన్సెస్ క్లీంకారకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన Jr.NTR!

రామ్ చరణ్-ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ పుట్టిన విషయం మనందరికి తెలిసిందే. ఇక మెగా ప్రిన్సెస్ పేరు క్లీంకార అంటూ మెగాస్టార్ అనౌన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక ఈ మెగా ప్రిన్సెస్ కు ఇప్పటికే చాలా బహుమతులు వచ్చాయి. ఓ మెగా అభిమాని ప్రత్యేకమైన ఉయ్యాలను క్లీంకార కోసం తయ్యారు చేసి బహుమతిగా ఇచ్చాడు. ఇక ఉపాసన సైతం తన లిటిల్ ప్రిన్సెస్ కోసం ఏకంగా ఓ స్పెషల్ రూమ్ ను డిజైన్ చేపించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఉపాసన. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా ప్రిన్సెస్ కు అదిరిపోయే గిఫ్ట్ పంపించాడట. మరి ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రామ్ చరణ్-ఎన్టీఆర్.. టాలీవుడ్ లో ఎంత మంచి స్నేహితులో మనందరికి తెలిసిందే. ఇక వీరి బంధం ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇంకా బలపడింది. దాంతో రెండు కుటుంబాల మధ్య ఏ వేడుక జరిగినా ఇరు కుటుంబాల నుంచి బహుమతులు పంపించుకుంటారు. ఇక ఈ మధ్యనే రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. దాంతో మెగా అభిమానుల నుంచి బహుమతులు, అభినందరలు అందుకుంటోంది మెగా ప్రిన్సెస్ క్లీంకార. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా ప్రిన్సెస్ కోసం అదిపోయే గిఫ్ట్ పంపించాడట.

క్లీంకార కోసం.. గోల్డ్ డాలర్స్ ను బహుమతిగా పంపించారంట యంగ్ టైగర్. ఆ డాలర్స్ మీద రామ్ చరణ్, ఉపాసన, క్లీంకార పేర్లు వచ్చేలా ప్రత్యేక డిజైన్ చేయించాడట తారక్. ఇక ఈ గిఫ్ట్ తో మెగా ఫ్యామిలీ సంతోషంగా ఉన్నారట. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తుండగా.. ఈ మూవీ తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక రామ్ చరణ్ ప్రజెంట్ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తున్నాడు. తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో ఓ మూవీకి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇదికూడా చదవండి: మహిళపై భర్త దాడి.. షాకింగ్‌ స్క్రీన్‌షాట్లు షేర్‌ చేసిన చిన్మయి!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş