iDreamPost
android-app
ios-app

Devara: ‘దేవర’ విషయంలో ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్! అదేంటంటే?

  • Published Sep 04, 2024 | 2:03 PM Updated Updated Sep 04, 2024 | 2:03 PM

Jr NTR, Devara Movie: దేవర మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ తారక్ ఫ్యాన్స్ ను టెన్షన్ కు గురిచేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Jr NTR, Devara Movie: దేవర మూవీ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ తారక్ ఫ్యాన్స్ ను టెన్షన్ కు గురిచేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Sep 04, 2024 | 2:03 PMUpdated Sep 04, 2024 | 2:03 PM
Devara: ‘దేవర’ విషయంలో ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్! అదేంటంటే?

తమ అభిమాన హీరో సినిమా థియేటర్లలోకి వస్తుందంటే చాలు.. ఫ్యాన్స్ కు అదో పెద్ద పండగ. థియేటర్ల దగ్గర రచ్చ రచ్చ చేస్తూ.. తమ ప్రేమను చాటుకుంటారు అభిమానులు. అయితే సినిమా రిలీజ్ అయ్యే క్రమంలో ఆ మూవీ నుంచి వచ్చే కొన్ని లీక్స్ ఫ్యాన్స్ ను కొంత టెన్షన్ కు గురిచేస్తుంటాయి. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ సినిమా విషయంలోనూ ఓ వార్త అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. మరి ఫ్యాన్స్ ను టెన్షన్ కు గురిచేస్తున్న ఆ న్యూస్ ఏంటి? చూద్దాం పదండి.

‘దేవర’.. యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పార్ట్ 1 సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. తారక్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన గ్లింప్స్, సాంగ్స్ కు ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. చుట్టమల్లే సాంగ్ ఏకంగా 100 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుని యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. దాంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

కాగా.. ఇక్కడి వరకు అంతాబానే ఉంది. ఫ్యాన్స్ కూడా హ్యాపీ. కానీ.. తాజాగా దేవర సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ అభిమానులకు కొత్త తలనొప్పిని తెస్తోంది. దేవర రన్ టైమ్ విషయంలో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఈ మూవీ 3 గంటల 10 నిమిషాల రన్ టైమ్ తో రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడీ విషయమే.. అభిమానుల ఆందోళనకు కారణం. ఇంత లాంగ్ రన్ టైమ్ అంటే ఇబ్బందులు తలెత్తుతాయని వారి బాధ. పైగా గతంలో ఇంతే రన్ టైమ్ తో వచ్చిన అంటే సుందరానికి, టైగర్ నాగేశ్వరరావు, భారతీయుడు 2 సినిమాల ఫలితాలను వారు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఎక్కవ రన్ టైమ్ ఉంటే ఫ్యాన్స్ మెప్పించడం కష్టమైపోతుంది. అయితే దేవర ఇంకా సెన్సార్ చేసుకోలేదు, కాబట్టి రన్ టైమ్ తగ్గే ఛాన్స్ లు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ఇక దేవర నుంచి మూడో సింగిల్ ను ఈరోజు(సెప్టెంబర్ 4) సాయంత్రం రిలీజ్ చేయనున్నారు. ‘దావూడీ’ అంటూ సాగే ఈ సాంగ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో తారక్ మాస్ డ్యాన్స్ తో ఫిదా చేస్తాడని సినీ ప్రముఖులు ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet