iDreamPost
android-app
ios-app

Devara Trailer: ‘దేవర’ ట్రైలర్ వచ్చేది ఆ రోజేనా? వేయి కళ్లతో ఫ్యాన్స్ ఎదురుచూపులు..

  • Published Aug 28, 2024 | 3:52 PM Updated Updated Aug 28, 2024 | 4:15 PM

దేవర ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందంటూ ఇండస్ట్రీలో వార్త వైరల్ గా మారింది. మరి నిజంగానే దేవర ట్రైలర్ వచ్చేది ఆ రోజేనా? ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

దేవర ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందంటూ ఇండస్ట్రీలో వార్త వైరల్ గా మారింది. మరి నిజంగానే దేవర ట్రైలర్ వచ్చేది ఆ రోజేనా? ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Aug 28, 2024 | 3:52 PMUpdated Aug 28, 2024 | 4:15 PM
Devara Trailer: ‘దేవర’ ట్రైలర్ వచ్చేది ఆ రోజేనా? వేయి కళ్లతో ఫ్యాన్స్ ఎదురుచూపులు..

‘దేవర’.. టాలీవుడ్ మూవీ లవర్స్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, పాటలు ప్రేక్షకుల నుంచి ఊహించని క్రేజ్ ను సొంతం చేసుకున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో రెండు పాటలు చార్ట్ బస్టర్ లుగా నిలిచాయి. దాంతో ట్రైలర్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో దేవర ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందంటూ ఇండస్ట్రీలో వార్త వైరల్ గా మారింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబో లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ ‘దేవర’. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రాబోతోంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో.. ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఫ్యాన్స్ క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దేవర ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది.

devara trailer

సెప్టెంబర్ 15న దేవర ట్రైలర్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే న్యూస్ పై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా..ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన రెండు సాంగ్స్ పాన్ ఇండియా రేంజ్ లో చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఇక మూడో పాట కూడా రెడీ అయినట్లు. ఈ సాంగ్ తొలి రెండు సాంగ్స్ కు మించి ఉంటుందని పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి హింట్ ఇచ్చారు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ ఆడియెన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. కాగా.. దేవర ట్రైలర్ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇటీవలే అతడి పాత్రను పరిచయం చేస్తూ.. ఓ వీడియోను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş