iDreamPost
android-app
ios-app

Devara: Jr. NTR అభిమానులకు దేవర నుండి మరో బ్యాడ్ న్యూస్!

  • Published Jan 30, 2024 | 2:34 PM Updated Updated Jan 30, 2024 | 2:34 PM

జూనియర్‌ ఎన్టీఆర్‌- కొరటాల శివ దర్శకత్వంలో రానున్న చిత్రం "దేవర". ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ పై అనేక వార్తలు వింటూ వస్తున్నాం. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులను మరో చేదు వార్త నిరుత్సాహపరుస్తోంది.

జూనియర్‌ ఎన్టీఆర్‌- కొరటాల శివ దర్శకత్వంలో రానున్న చిత్రం "దేవర". ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ పై అనేక వార్తలు వింటూ వస్తున్నాం. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులను మరో చేదు వార్త నిరుత్సాహపరుస్తోంది.

  • Published Jan 30, 2024 | 2:34 PMUpdated Jan 30, 2024 | 2:34 PM
Devara: Jr. NTR అభిమానులకు దేవర నుండి మరో బ్యాడ్ న్యూస్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రంపైన భారీ అంచనాలు నెలకొంటున్నాయి. అభిమానులంతా దేవర రిలీజ్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు అన్ని పనులు చివరి దశకు చేరుకున్నట్లుగా సమాచారం. అయితే, గతంలో దేవర చిత్రం మొదటి భాగాన్ని ఏప్రిల్‌ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాన్నుట్లు నిర్మాతలు ప్రకటించారు. కానీ, అది జరిగేలా లేదని.. మరో డేట్ ను ఫిక్స్ చేసినట్లు పలు వార్తలు వినిపించాయి. విడుదల ఆలస్యం అవుతున్నందుకు ఇప్పటికే నిరాశలో ఉన్న అభిమానులకు.. ఇప్పుడు మరొక వార్త ఇంకాస్త నిరుత్సాహ పరుస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం దేవర ఇంకాస్త ఆలస్యం అయ్యేలా ఉంది.

ఇటీవల దేవర చిత్రానికి సంబంధించి విడుదల చేసిన కొన్ని షాట్స్, గ్లిమ్ప్స్.. అభిమానులకు ఈ మూవీ పైన మరింత ఎక్స్పెక్టషన్స్ ను పెంచేసింది. దీనితో కొరటాల, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ను చూసేందుకు.. ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ మధ్య దేవర సినిమా వాయిదా పడనుందనే వార్తలు విన్నాము. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఏప్రిల్‌ 5న కాకుండా.. రెండు నెలలు ముందుకు వెళ్లనుందనే టాక్ వినిపించింది. షూటింగ్‌ బాకీ, వీఎఫ్‌ఎక్స్‌, ఏపీలో ఎలక్షన్‌లు ఇలా రక రకాల కారణంగా మూవీ రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేశారు. దీనితో దేవర రిలీజ్ ఎప్పుడు అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఆగస్టు 17న పుష్ప-2 ప్లేస్ లో దేవర రావచ్చేమో అని భావించారు. కానీ, అటు పుష్ప టీమ్ ఏ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. దీనితో సెప్టెంబర్ లో దేవర ను విడుదల చేస్తారేమో అని అనుకున్నారు. కానీ, అది కూడా అయ్యేలా కనిపించడంలేదు. ఇప్పుడు దేవర మరింత వెనక్కి వెళ్లేలా కనిపిస్తోంది. దేవరను అక్టోబర్ లో దసరా సమయంలో రిలీజ్ చేస్తారనే టాక్ కొత్తగా వినిపిస్తోంది. ఇప్పటివరకైతే దసరా కు విడుదలయ్యే సినిమాల లిస్ట్ ఖాళీగానే ఉంది. కాబట్టి ఆ సమయంలో దేవర రావడం పక్కా అంటున్నారు. కానీ, మరోవైపు కొరటాలను చూస్తుంటే.. అనుకున్న సమయానికే షూటింగ్ ను ఫినిష్ చేస్తున్నాడు. కాబట్టి రిలీజ్ డేట్ మరీ అంత వెనక్కి వెళ్లే ఛాన్స్ కూడా లేదు. కానీ ఇప్పటివరకు ఈ దేవర చిత్రం రిలీజ్ డేట్ పై ఎటువంటి క్లారిటీ రాలేదు. మేకర్స్ నుంచి కూడా ఈ విషయంపై ఎటువంటి స్పందన లేదు.

bad news from devara movie

ఇక దేవర చిత్రం దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి కోసరాజు హరికృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, దేవర సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన జాన్వీ కపూర్‌ నటిస్తున్నారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన దేవర ఫస్ట్ గ్లిమ్ప్స్ అందరిని ఆకట్టుకుంది. దీనితో ఈ చిత్రంపై అభిమానులకే కాకుండా.. సాధారణ ప్రేక్షకులకు సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి, ఈ సినిమా విడుదలైన తర్వాత ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. ఏదేమైనా ప్రస్తుతం దేవర రిలీజ్ డేట్ పై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. కానీ, మేకర్స్ నుంచి మాత్రం ఎటువంటి అధికారక ప్రకటన రాలేదు. కాబట్టి అప్పటివరకు వేచి చూడాలి. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş