iDreamPost
android-app
ios-app

Devara: దేవరోడి రీ సౌండ్ గట్టిగా ఉంది! ఇక సేఫ్ జోన్ లోకి కొరటాల శివ!

  • Published May 21, 2024 | 1:40 PM Updated Updated May 21, 2024 | 1:40 PM

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తోన్న దేవర సినిమా నుంచి తారక్‌ బర్త్‌ డే సందర్భంగా ఫియర్‌ సాంగ్‌ రిలీజ్‌ చేశారు. ఇక పాట మిలియన్ల వ్యూస్‌తో దూసుకుతోంది. ఒక్క పాటతో దేవర రేంజ్‌ ఏంటో.. తెలియజేశారని.. కొరటాల శివ సేఫ్‌ జోన్‌లోకి వెళ్లినట్లే అంటున్నారు ఫ్యాన్స్‌. ఆ వివరాలు. .

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తోన్న దేవర సినిమా నుంచి తారక్‌ బర్త్‌ డే సందర్భంగా ఫియర్‌ సాంగ్‌ రిలీజ్‌ చేశారు. ఇక పాట మిలియన్ల వ్యూస్‌తో దూసుకుతోంది. ఒక్క పాటతో దేవర రేంజ్‌ ఏంటో.. తెలియజేశారని.. కొరటాల శివ సేఫ్‌ జోన్‌లోకి వెళ్లినట్లే అంటున్నారు ఫ్యాన్స్‌. ఆ వివరాలు. .

  • Published May 21, 2024 | 1:40 PMUpdated May 21, 2024 | 1:40 PM
Devara: దేవరోడి రీ సౌండ్ గట్టిగా ఉంది! ఇక సేఫ్ జోన్ లోకి కొరటాల శివ!

ట్రిపుల్‌ ఆర్‌ సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా ఎదిగాడు జూనియర్‌ ఎన్టీఆర్‌. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్నవి అన్నీ కూడా పాన్‌ ఇండియా ప్రాజెక్టులే. కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర, బాలీవుడ్‌లో వార్‌ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక వీటిలో దేవర సినిమా మీద టాలీవుడ్‌లో మాత్రమే కాక.. పాన్‌ ఇండియా వైడ్‌గా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా చిత్ర బృందం దేవర నుంచి ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌ చేశారు. తారక్‌ బర్త్‌డే నాడు దేవర నుంచి ఫియర్‌ సాంగ్‌ రిలీజ్‌ చేశారు. అనిరుధ్‌ మరోసారి తన మార్క్‌ మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేశాడు. ఫియర్‌ సాంగ్‌తో దేవరోడు గట్టి రీసౌండ్‌ ఇచ్చాడు. ఇక ఈ పాట ఇటు అభిమానుల భయాలను.. డైరెక్టర్‌ ఆచార్య కొరటాల శివపై నెలకొని ఉన్న భారాన్ని తీసేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు విమర్శకులు. ఆ వివరాలు..

కొరటాల శివ అంటే.. సక్సెస్‌కు కెరాఫ్‌ అడ్రెస్‌గా నిలిచాడు. అయితే ఆచార్య సినిమాతో ఆ ఇమేజ్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయింది. ఆచార్య తర్వాత కొరటాల శివతో సినిమా అంటే చాలా మంది హీరోలు భయపడ్డారు. అలాంటి సమయంలో తారక్‌ ధైర్యం చేశాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్‌ సినిమా ఎంత హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయినా సరే.. ఆచార్య రిజల్ట్‌ ఆ నమ్మకాన్ని వమ్ము చేసింది. అసలే ట్రిపుల్‌ ఆర్‌ సినిమాతో జూనియర్‌ పాన్‌ ఇండియా హీరోగా ఎదిగాడు. అలాంటి తరుణంలో కొరటాల శివ.. ఎన్టీఆర్‌ను పాన్‌ ఇండియా హీరోగా హ్యాండిల్‌ చేయగలడా.. అనే అనుమానాలు అభిమానుల్లో నెలకొని ఉన్నాయి. ఇటు కొరటాల శివ మీద కూడా ఆచార్య ప్రభావం గట్టిగానే ఉంది. ఆయన ఆశలన్ని దేవర మీదనే ఉన్నాయి.

ఇదుగో ఇలాంటి సమయంలో దేవర నుంచి విడుదలైన ఫియర్‌ సాంగ్‌ ఈ భయాలన్నింటిని పటాపంచలు చేసింది. తారక్‌ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఎలాంటి పాట ఉండాలో దాన్నే మేకర్స్‌ నిర్మించారు అంటున్నారు తారక్‌ అభిమానులు. అనిరుధ్‌ స్వరపరిచిన ఈ పాట.. దేవరొడి స్టామినాను ఎలివేట్‌ చేసేలా సాగింది. దూకే ధైర్యమా.. దేవర ముందు నువ్వెంత అంటూ ధైర్యానికే భయం పెట్టేలా అనిరుధ్‌ పాడిన పాట ఇటు ఫ్యాన్స్‌లో ఉన్న అనుమానాలు, భయాలను.. అటు దర్శకుడు కొరటాల శివ మీదున్న భారాన్ని తొలగించింది అంటున్నారు.

ఈ సాంగ్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఊర మాస్‌గా కనిపించారు. ఇక సాంగ్‌ విన్న ప్రతి ఒక్కరు దేవర భారీ హిట్టు కొట్టడం పక్కా అంటున్నారు. ఒక్క సాంగ్‌తో ఈ సినిమాపై అభిమానుల్లో ఉన్న భయాలతో పాటు.. దర్శకుడు కొరటాల శివను సేఫ్‌ జోన్‌లో ఉంచాడు అనిరుధ్‌ అంటున్నారు క్రిటిక్స్‌. ఈ ఒక్కపాటతో.. తారక్‌కి ప్యాన్‌ ఇండియా ఖాతాలో హిట్టు పడ్డట్టే అంటున్నారు అభిమానులు. ఇక దేవర ఫియర్‌ సాంగ్‌కు టాలీవుడ్‌లోనే కాక.. పాన్‌ ఇండియా వైడ్‌గా మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఇంత జోష్‌ ఉన్న సాంగ్‌ ఇచ్చినందుకు అనిరుధ్‌కు థాంక్స్‌ చెబుతున్నారు జూనియర్‌ ఫ్యాన్స్‌.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişartemisbet girişgrandpashabet