iDreamPost
android-app
ios-app

యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు పూనకాలే.. కల్కిలో Jr.NTR?

  • Published Feb 01, 2024 | 9:46 PM Updated Updated Feb 01, 2024 | 9:46 PM

Jr. NTR in Kalki 2898 AD?: డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి మూవీ కోసం పెద్ద ప్లానే వేసినట్లున్నాడు. అందుకే ఒక్కో స్టార్ హీరోను బరిలోకి దింపుతున్నాడు. తాజాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.

Jr. NTR in Kalki 2898 AD?: డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి మూవీ కోసం పెద్ద ప్లానే వేసినట్లున్నాడు. అందుకే ఒక్కో స్టార్ హీరోను బరిలోకి దింపుతున్నాడు. తాజాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.

  • Published Feb 01, 2024 | 9:46 PMUpdated Feb 01, 2024 | 9:46 PM
యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు పూనకాలే.. కల్కిలో Jr.NTR?

‘కల్కి 2898 AD’ విడుదలకు ముందే మూవీ లవర్స్ కు మెంటల్ ఎక్కిస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం రోజు రోజుకు అంచనాలను పెంచేస్తోంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె లాంటి భారీ కాస్టింగ్ తో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా ఈ మూవీ నుంచి వస్తున్న అప్డేట్స్ చూస్తుంటే ఒక్కొక్కరికి మతిపోతోంది. దీంతో నాగ్ అశ్విన్ ఏదో పెద్ద ప్లానే వేశాడని నెటిజన్లు షాక్ అవుతున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మెంటల్ ఎక్కించే అప్డేట్ తెగ వైరల్ అవుతోంది.

‘కల్కి’ నుంచి మరో క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే భారీ కాస్టింగ్ అందరి మతిపోగొడుతున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇది చాలదు అన్నట్లుగా క్యామియో రోల్స్ కోసం ఎవ్వరూ ఊహించని హీరోలను దింపుతున్నాడు ఈ క్రియేటీవ్ డైరెక్టర్.ఇప్పటికే గెస్ట్ రోల్స్ కోసం దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండను తీసుకున్న వార్తలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇక తాజాగా న్యాచురల్ స్టార్ నాని సైతం కల్కిలో ఓ కీలక పాత్ర చేస్తున్నట్లు న్యూస్ తెగ చెక్కర్లు కొట్టింది. నానితో పాటుగా మరో స్టార్ హీరో కూడా ఈ మూవీలో అతిథి పాత్రలో కనిపించనున్నాడట. ఆ హీరో ఎవరో కాదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.

ఈ వార్త యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. క్లైమాక్స్ ముందు వచ్చే కీలక సన్నివేశాల్లో పరశురాముడి పాత్రలో జూ.ఎన్టీఆర్ కనిపిస్తారని తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఇటు నిర్మాణ సంస్థ గానీ, అటు డైరెక్టర్ నాగ్ అశ్విన్ గానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో వీరి మౌనం వెనక అర్థం ఏంటో అర్దం కాక సినీ అభిమానులు అయోమయానికి గురౌతున్నారు. కాగా.. ఇదే న్యూస్ ఒకవేళ నిజమైతే.. థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం అంటున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్. ఒకే ఫ్రేమ్ లో ఇటు ప్రభాస్ ను, అటు ఎన్టీఆర్ ను చూస్తే.. అరాచకాలే అంటున్నారు. ఇదిలా ఉండగా.. మే 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మరి కల్కిలో ఎన్టీఆర్ నటిస్తే ఎలా ఉంటుందో? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet