Jr NTR And Prashanth Neel Film Expensive In Career: NTR-ప్రశాంత్ నీల్ సినిమాకు కళ్లు చెదిరే బడ్జెట్.. కాంబో అలాంటిది మరి!

NTR-ప్రశాంత్ నీల్ సినిమాకు కళ్లు చెదిరే బడ్జెట్.. కాంబో అలాంటిది మరి!

Jr NTR-Prashanth Neel Film Budget: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్​తో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కొత్త సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఫిల్మ్ బడ్జెట్ గురించి ఇప్పుడు నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Jr NTR-Prashanth Neel Film Budget: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్​తో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కొత్త సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఫిల్మ్ బడ్జెట్ గురించి ఇప్పుడు నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ఇండస్ట్రీలో కొన్ని కాంబోలకు చాలా క్రేజ్ ఉంటుంది. వాళ్ల కలయికలో సినిమా వస్తోందంటే నెక్స్ట్ లెవల్​లో బజ్ క్రియేట్ అవుతుంది. అలాంటి కాంబోనే జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్. వీళ్లిద్దరూ కలసి ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు అనగానే పక్కా ఫుల్ మీల్స్ అని అభిమానులు సిద్ధమైపోయారు. మూవీ లవర్స్ కూడా ఈ చిత్రంపై ఫుల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు, సరైన స్టోరీ, క్యారెక్టర్ తగిలితే బాక్సాఫీస్ రికార్డులను ఊచకోత కోసే హీరో కలసి రానుండటంతో ఈసారి చరిత్ర సృష్టించడం ఖాయమని అంటున్నారు. తారక్-నీల్ కాంబో మూవీ కథ ఎలా ఉంటుంది? అందులో ఎన్టీఆర్ రోల్ ఎలా ఉండబోతోంది? అనే విషయాలతో పాటు మూవీ బడ్జెట్ గురించి కూడా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా బడ్జెట్​ గురించి ఇప్పుడో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్​కు ఏకంగా రూ.350 కోట్ల బడ్జెట్ పెడుతున్నారని సమాచారం. సినిమా పూర్తయ్యేసరికి ఇది రూ.400 కోట్ల మార్క్​ను కూడా టచ్ చేయొచ్చని ఫిల్మ్ నగర్ టాక్. ఒకవేళ ఇదే నిజమైతే అటు తారక్, ఇటు డైరెక్టర్ నీల్ ఇద్దరి కెరీర్​లో ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ అవుతుందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ గత చిత్రం ‘సలార్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ మూవీ బడ్జెట్ రూ.270 కోట్లు అని తెలుస్తోంది. ఆ లెక్కన చూసుకుంటే తారక్​తో తీసే సినిమా ఇంకా బిగ్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. ఇది నీల్ డ్రీమ్ ఫిల్మ్ అని.. భారీ బడ్జెట్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ స్టోరీని ఇన్నాళ్లూ తెర మీదకు తీసుకురాకుండా పక్కనబెట్టారని గతంలో రూమర్స్ వచ్చాయి.

కథ, కథనంతో పాటు హీరో క్యారెక్టరైజేషన్ నచ్చడంతో అటు ఎన్టీఆర్, ఇటు మైత్రీ మూవీ మేకర్స్ ప్రాజెక్ట్​ను లాక్‌ చేశారని సమాచారం. స్టోరీతో పాటు నీల్ డైరెక్షన్, తారక్ క్రేజ్​ మీద నమ్మకంతో భారీ బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు ధైర్యం చేస్తున్నారని వినికిడి. ఈ వార్త తెలిసిన నెటిజన్స్.. ఊహకందని రేంజ్​లో బడ్జెట్ ఉందని, ఈ కాంబో కోసం ఎంత ఖర్చు పెట్టినా డబుల్ రిటర్న్స్ వచ్చేస్తాయని అంటున్నారు. డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి నీల్ మరింత పకడ్బందీగా చిత్రాన్ని తెరకెక్కిస్తారని.. ‘కేజీఎఫ్’, ‘సలార్’ను మించిన రేంజ్​లో ఉంటుందని చెబుతున్నారు. ఇక, నీల్ మూవీతో పాటు మరికొన్ని ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ‘వార్ 2’లో యాక్ట్ చేస్తున్నారు. ‘దేవర 2’ కూడా పైప్​లైన్​లో ఉంది. మరి.. తారక్-నీల్ కాంబో మూవీ ఎలా ఉండబోతుందని మీరు ఎక్స్​పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.

Show comments