iDreamPost
android-app
ios-app

John Abraham: ఆ యాడ్స్​లో నటించడమంటే చావును అమ్మడమే.. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం కామెంట్స్!

  • Published Aug 09, 2024 | 9:00 PM Updated Updated Aug 09, 2024 | 9:00 PM

డబ్బుల కోసం అమాయకులను బలి చేయొద్దని ఓ స్టార్ హీరో అంటున్నాడు. అలాంటి యాడ్స్​లో నటించడమంటే చావును అమ్మడమేనని చెబుతున్నాడు.

డబ్బుల కోసం అమాయకులను బలి చేయొద్దని ఓ స్టార్ హీరో అంటున్నాడు. అలాంటి యాడ్స్​లో నటించడమంటే చావును అమ్మడమేనని చెబుతున్నాడు.

  • Published Aug 09, 2024 | 9:00 PMUpdated Aug 09, 2024 | 9:00 PM
John Abraham: ఆ యాడ్స్​లో నటించడమంటే చావును అమ్మడమే.. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం కామెంట్స్!

సెలబ్రిటీలు యాడ్స్​లో నటించడం కామనే. మన దేశంలో క్రికెటర్లతో పాటు ఫిల్మ్ స్టార్స్ ఎక్కువగా అడ్వర్టయిజ్​మెంట్స్​లో కనిపిస్తుంటారు. వీటిల్లో నటించినందుకు గానూ భారీ మొత్తంలో పారితోషికాలు అందుకుంటారు. అయితే కొన్ని యాడ్స్​లో నటించినందుకు నటులపై విమర్శలు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా పాన్ మసాలా యాడ్స్​ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. ఇలాంటి అడ్వర్టయిజ్​మెంట్స్​లో కనిపించినందుకు గానూ పలువురు క్రికెటర్లతో పాటు సినీ తారల మీద కూడా భారీగా విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ అంశంపై బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహాం రియాక్ట్ అయ్యారు. ఆ యాడ్స్​లో నటించడమంటే చావును అమ్మడమేనని ఆయన అన్నారు.

పాన్ మసాలా అడ్వర్టయిజ్​మెంట్లలో నటిస్తూ కొందరు తారలు అమాయకులను బలి చేస్తున్నారని జాన్ అబ్రహాం సీరియస్ అయ్యారు. సెలబ్రిటీలు నిజాయితీతో ఉండాలని, రెండు ముఖాలు ఉండటం కరెక్ట్ కాదన్నారు. పాన్ మసాలా, మౌత్ ఫ్రెష్నర్స్ లాంటి యాడ్స్​లో నటించొద్దని తాను డెసిషన్ తీసుకున్నానని.. అలాంటి కంపెనీలతో జతకట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘కొందరు నటులు ఫిట్​నెస్​ గురించి గొప్పలు చెబుతారు. వాళ్లే పాన్ మసాలా యాడ్స్​లోనూ నటిస్తారు. నేను ఏ యాక్టర్​నూ అగౌరవపర్చట్లేదు. కానీ ఇది కరెక్ట్ కాదు. నేనైతే చావును ఇలా అమ్మను’ అని జాన్ అబ్రహాం చెప్పుకొచ్చారు.

ప్రతి ఏటా పాన్ మసాలా ఇండస్ట్రీ 45 వేల కోట్ల టర్నోవర్​ రాబడుతోందని జాన్ అబ్రహాం తెలిపారు. వాళ్లకు సర్కారు నుంచి కూడా మద్దతు ఉందని.. అందుకే ఆ వ్యాపారం ఇంకా లీగల్​గా చలామణి అవుతోందన్నారు. ఇలాంటి యాడ్స్​లో నటించడం ద్వారా అమాయకుల జీవితాలను నాశనం చేస్తున్నారని.. పాన్ మసాలా వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు జాన్ అబ్రహాం. ఇక, ఈ హీరో నటించిన ‘వేదా’ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగానే ప్రమోషన్స్​లో పాల్గొన్న జాన్ అబ్రహాం పైవ్యాఖ్యలు చేశారు. ‘వేదా’ మూవీని అందరూ తప్పక చూడాలని కోరారు. మన దేశంలో స్త్రీలు, పిల్లలకు రక్షణ లేదని.. అలాంటి పలు విషయాల గురించి ఇందులో తెలియజేశామని వివరించారు.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabet