iDreamPost
android-app
ios-app

Jhanvi Kapoor: జాన్వీకి చరణ్ మూవీ ఆఫర్.. అంతా చేసింది తారకే అంట!

  • Published Feb 09, 2024 | 4:26 PM Updated Updated Feb 09, 2024 | 4:36 PM

ప్రస్తుతం తారక్ నటిస్తున్న దేవర చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న .. బాలీవుడ్ హీరోయిన్ "జాన్వీ కపూర్" కు .. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే.. మరో తెలుగు సినిమాలో.. అది కూడా ఓ స్టార్ హీరో పక్కన నటించే అవకాశం వచ్చిదంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం తారక్ నటిస్తున్న దేవర చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న .. బాలీవుడ్ హీరోయిన్ "జాన్వీ కపూర్" కు .. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే.. మరో తెలుగు సినిమాలో.. అది కూడా ఓ స్టార్ హీరో పక్కన నటించే అవకాశం వచ్చిదంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి.

  • Published Feb 09, 2024 | 4:26 PMUpdated Feb 09, 2024 | 4:36 PM
Jhanvi Kapoor: జాన్వీకి చరణ్ మూవీ ఆఫర్.. అంతా చేసింది తారకే అంట!

సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటి “శ్రీదేవి” గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆ హీరోయిన్ ను ఎప్పటికి గుర్తుపెట్టుకుంది. ఇక ఆ తర్వాత ఆమె వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని.. శ్రీదేవి కూతురు “జాన్వీ కపూర్” సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె పలు బాలీవుడ్ సినిమాలలో నటించి .. ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఆమె నటన ప్రావిణ్యం కేవలం బాలీవుడ్ తోనే ఆగిపోకుండా .. ఇప్పుడు టాలీవుడ్ వరకు వచ్చింది. జాన్వీ కపూర్ మొదటి సారి .. ఓ భారీ టాలీవుడ్ చిత్రంతో.. తెలుగులో పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. అదే తాజాగా ఎన్టీఆర్ నటిస్తున్న “దేవర” చిత్రం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తుంది. దీనితో ప్రస్తుతం ఈ సినిమాపైన.. అంతటా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో, ఎన్టీఆర్ .. చరణ్ తో .. జాన్వీ కపూర్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీనితో ఈ వార్త ఇప్పుడు కొత్త చర్చలకు దారి తీస్తుంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో “దేవర” చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పనులు వేగం పుంజుకున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ పై .. ఇప్పటికే అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. తారక్ ను తెరపైన చూసి ఇప్పటికే ఏళ్ళు గడిచిపోవడంతో.. అభిమానులు కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ చిత్రం రిలీజ్ డేట్ ను ఇప్పటివరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. మరో వైపు ఇప్పటికే విడుదలైన దేవర లుక్స్ అండ్ గ్లిమ్ప్స్ తో .. ఈ సినిమాపైన భారీ ఎక్సపెక్టషన్స్ నెలకొన్నాయి. అయితే, ఈ సినిమాతో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ “జాన్వీ కపూర్” మొదటిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. అయితే, ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే.. ఈ హీరోయిన్ కు మరో తెలుగు సినిమా ఆఫర్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. పైగా, ఆ రెండో ఛాన్స్ కూడా పాన్ ఇండియా స్టార్ తోనే.. అంతేకాకుండా ఈ మూవీ ఆఫర్ కూడా ఎన్టీఆర్ ద్వారానే వచ్చినట్లు సమాచారం.

అయితే, రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ #RC16 గా డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో చేయబోతున్నాడు. ఈ క్రమంలో దేవర చిత్రంలో జాన్వీ కపూర్ యాక్టింగ్ చూసిన ఎన్టీఆర్ .. రాబోయే #RC16 సినిమాకు .. జాన్వీ కపూర్ పర్ఫెక్ట్ మ్యాచ్ అంటూ .. రామ్ చరణ్ కు, బుచ్చి బాబు సనా కు సజెస్ట్ చేశాడట. దీనితో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవేళ నిజంగానే జాన్వీ కపూర్ ను #RC16 లో సెలెక్ట్ చేస్తే కనుక.. ఖచ్చితంగా ఈ హీరోయిన్ లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లే అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక ఈ విషయంపైన మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom