iDreamPost
android-app
ios-app

‘Jersey’ movie review and box office collection హిందీ జెర్సీ గురించి ఏమనుకుంటున్నారు

  • Published Apr 23, 2022 | 1:34 PM Updated Updated Apr 23, 2022 | 1:34 PM
‘Jersey’ movie review and box office collection హిందీ జెర్సీ గురించి ఏమనుకుంటున్నారు

నిన్న భారీ ఎత్తున విడుదలైన హిందీ జెర్సీ దేశవ్యాప్తంగా తెచ్చిన నెట్ వసూళ్లు కేవలం నాలుగు కోట్ల లోపే ఉన్నాయని ట్రేడ్ రిపోర్ట్. ఇంత గ్రాండ్ గా రిలీజ్ చేస్తే అతి తక్కువ వసూళ్లు నమోదు కావడం షాక్ ఇచ్చేదే. ఒరిజినల్ వెర్షన్ ని డీల్ చేసిన గౌతమ్ తిన్ననూరినే షాహిద్ కపూర్ ని డైరెక్ట్ చేశాడు. ముందు రోజు వేసిన ప్రీమియర్ కు మీడియా ప్లస్ ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి స్టాండింగ్ ఒవేషన్ వచ్చింది. కానీ గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. మల్టీ ప్లెక్సుల్లో ఓ మాదిరి ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ బిసి సెంటర్స్ ఆడియన్స్ మాత్రం ఇంత హై ఎమోషన్ మాకొద్దంటూ కెజిఎఫ్ 2కె ఓటు వేశారు. ఫలితంగా నిన్నే పది కోట్లకు పైగా వచ్చిందట.

జెర్సి సినిమా విషయానికి వస్తే షాహిద్ ఎంత గొప్పగా నటించినప్పటికీ నానిని మ్యాచ్ చేయలేకపోయాడని రెండు వెర్షన్లు చూసిన వాళ్ళ కామెంట్. ముఖ్యంగా రైల్వే స్టేషన్ లో సీన్ ని అందుకు ఉదాహరణగా చెబుతున్నారు. పైగా హిందీలో పావు గంట అదనంగా నిడివి పెంచడం కొంత మైనస్ అయ్యింది. ముంబై క్రిటిక్స్ సెకండ్ హాఫ్ లెన్త్ గురించి ఫిర్యాదు చేశారు. మరీ అంత సేపు క్రికెట్ చూసే పనైతే ఐపిఎల్ ఉందిగా దానికి సినిమా హాల్ ఎందుకు అనే ధోరణిలో గట్టిగానే నిలదీశారు. తెలుగులోనూ అలాగే ఉన్నప్పటికీ మన ప్రేక్షకులు దాన్ని రిసీవ్ చేసుకున్నారు. కానీ అక్కడ మాత్రం వర్కౌట్ కావడం మీద అనుమానాలు మొదలయ్యాయి.

అల్లు అరవింద్, దిల్ రాజు, సూర్యదేవర నాగవంశీ నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందిన జెర్సీకి బడ్జెట్ మరీ వందల కోట్లలో కాలేదు కానీ వాయిదాల వల్ల పెట్టుబడుల మీద భారం పెరిగింది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అదేమంత సమస్య కాదు. అయితే ఇప్పుడీ పెర్ఫార్మన్స్ తో జెర్సీ ఏ మేరకు గట్టెక్కుతుందో చూడాలి. కెజిఎఫ్ 2 మాత్రం నార్త్ మార్కెట్ లో ఇంకా బలంగానే ఉంది. స్లో అయ్యే సూచనలు కనిపించడం లేదు. కేవలం వారం గ్యాప్ తో జెర్సి రిస్క్ చేయడం భయపడినట్టే ఫలితాన్ని ఇచ్చింది. ఇవాళ రేపు వీకెండ్ ఏదో అద్భుతం జరగకపోదా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వీటి సంగతి ఎలా ఉన్నా షాహిద్ కపూర్ నటనాపరంగా మరో కెరీర్ బెస్ట్ అందుకున్నాడు