iDreamPost
android-app
ios-app

థగ్ లైఫ్ నుంచి మరో హీరో ఔట్! మణిరత్నం సినిమాకు వరస ఇబ్బందులు

  • Published Mar 24, 2024 | 4:58 PM Updated Updated Mar 24, 2024 | 4:58 PM

ప్రముఖ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్‌లో రాబోతున్న థగ్‌ లైఫ్‌ సినిమాకు ఒకదాని తర్వాత ఒక ఇబ్బంది ఎదురువుతోంది. తాజాగా ఆ సినిమా నుంచి ఓ స్టార్‌ హీరో బయటికి వెళ్లిపోయాడు. ఆ వివరాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

ప్రముఖ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్‌లో రాబోతున్న థగ్‌ లైఫ్‌ సినిమాకు ఒకదాని తర్వాత ఒక ఇబ్బంది ఎదురువుతోంది. తాజాగా ఆ సినిమా నుంచి ఓ స్టార్‌ హీరో బయటికి వెళ్లిపోయాడు. ఆ వివరాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

  • Published Mar 24, 2024 | 4:58 PMUpdated Mar 24, 2024 | 4:58 PM
థగ్ లైఫ్ నుంచి మరో హీరో ఔట్! మణిరత్నం సినిమాకు వరస ఇబ్బందులు

ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులోనే కాకుండా మొత్తంగా ఇండియాలో కూడా ఆయనకు దిగ్గజ దర్శకుడిగా ఆయనకు తిరుగు లేని ఇమేజ్ ఉంది. తన సినిమాలు గత కొన్నేళ్లుగా పెద్ద హిట్ లు అవకపోయినా ఆయన ఇమేజ్ మాత్రం చెక్కు చేదరలేదు. అయితే ఎవరూ ఊహించని విధంగా 2022 లో తమిళ బాక్సాఫీస్ వద్ద పొన్నియిన్ సెల్వన్‌తో మాస్ కమ్ బ్యాక్ ఇచ్చారు. రెండు భాగాల ఫ్రాంచైజీగా తెరకెక్కిన ఈ సినిమా అందరికీ లాభాలను తెచ్చిపెట్టింది. ఆ తరువాత మణిరత్నం కమల్ హాసన్‌తో థగ్ లైఫ్ అనే సినిమాని అనౌన్స్ చేశారు.

థగ్ లైఫ్‌ను భారీ స్థాయిలో నిర్మించనున్నారని మొదటి నుంచీ వార్తలు వచ్చాయి. కమల్ తో పాటు దుల్కర్ సల్మాన్, త్రిష, జయం రవి, జోజు జార్జ్ వంటి నటులు ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రలు పోషించడానికి ఎంపికయ్యారు. అయితే వివిధ కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుండి ఇటీవలే దుల్కర్ సల్మాన్ తప్పుకున్నారు అన్న వార్త ప్రేక్షకులని ఎంతగానో నిరాశపరిచింది. కమల్ – దుల్కర్ లని పోటాపోటీగా స్క్రీన్ పై చూడాలనుకున్న అభిమానుల ఆశలు నిజం కాకుండా పోయాయి. అయితే ఆ వార్త నుంచి తేరుకునే లోపు జయం రవి కూడా థగ్ లైఫ్ నుండి తప్పుకున్నారని వార్తలు రావడంతో ఈ ప్రాజెక్ట్ కి ఈ వరస ఇబ్బందులు ఎంటని అభిమానులు కంగారు పడుతున్నారు.

మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌తో భారీ హిట్ అందించినప్పటికీ, ఆయన తన తదుపరి చిత్రం థగ్ లైఫ్ లో ఇలా హీరోలు బయటకి వెళ్లిపోవడం ఏంటనే ప్రశ్న తమిళ సినీ వర్గాల్లో కూడా ఒక చర్చగా మారింది. కమల్ హాసన్ వంటి ప్రముఖ నటుడు ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ సినిమా బెస్ట్ విజువల్ అప్పీల్ తో పాటు అద్భుతమైన మేకింగ్ విలువలు ఉన్న మంచి టీజర్‌ తో అందరి దృష్టినీ ఆకర్షించింది. అలాంటిది ఇప్పుడు దుల్కర్, జయం రవి ఇద్దరూ వెళ్లిపోవడంతో సినిమా ప్రాధాన్యతను కోల్పోతోందేమో అని ప్రేక్షకులు భయపడుతున్నారు. కాగా దుల్కర్ స్థానంలో శింబు థగ్ లైఫ్ సినిమాలో నటించవచ్చనే రూమర్లు ఇటీవలే వచ్చాయి. మరి జయం రవి పాత్రలో ఎవరిని తీసుకుంటారో చూడాలి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş