iDreamPost
android-app
ios-app

‘కావాలా’ పాటకు జపాన్ బ్రాండ్ అంబాసిడర్ డ్యాన్స్! వీడియో వైరల్!

  • Author ajaykrishna Updated - 12:14 PM, Fri - 18 August 23
  • Author ajaykrishna Updated - 12:14 PM, Fri - 18 August 23
‘కావాలా’ పాటకు జపాన్ బ్రాండ్ అంబాసిడర్ డ్యాన్స్! వీడియో వైరల్!

ప్రస్తుతం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద జైలర్ మేనియా కొనసాగుతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఈ సినిమా.. ఇటీవల విడుదలై ఫస్ట్ డే నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మొదటి వారం రోజుల్లో ఏకంగా రూ. 450 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి.. మరోసారి సూపర్ స్టార్ స్టామినా ప్రూవ్ చేసింది. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో పాటలన్నీ నెక్స్ట్ లెవెల్ లో వైరల్ అవ్వడమే కాకుండా సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేశాయి. అయితే.. ముఖ్యంగా తమన్నా డ్యాన్స్ చేసిన కావాలా సాంగ్ ప్రపంచవ్యాప్తంగా సంగీతప్రియులను ఓ రేంజ్ లో ఊపేసింది.

ఇక ఇండియన్ సినిమాల పాటలు అప్పుడప్పుడు విదేశీయులను కూడా కదిలిస్తుంటాయి. వారితో కూడా స్టెప్పులు వేయిస్తుంటాయి. ఇప్పటిదాకా చాలా సాంగ్స్ అలా వైరల్ అవ్వడం చూశాం. ఇప్పుడు కొత్తగా కావాలా ట్రెండ్ నడుస్తోంది. తాజాగా కావాలా పాటకు ఓ జపాన్ కు చెందిన ప్రముఖులు స్టెప్పులేశారు. సూపర్ స్టార్ రజినీకి దాదాపు రెండు దశాబ్దాలుగా జపాన్ లోను విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలో జపాన్ భారత రాయబారి హిరోషి సుజుకీ ‘కావాలా..’ పాటకు ఓ యూట్యూబర్ తో కలిసి డాన్స్ చేశారు. జపనీస్ యూట్యూబర్ మైయో శాన్‌ తో కలిసి హిరోషి కాలు కదిపారు. సూపర్ స్టార్ రజనీ పట్ల తన ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉంటుందని కాప్షన్ జోడించాడు. ప్రస్తుతం హిరోషి డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా.. మన ఇండియన్ సాంగ్స్ కి విదేశీయులు డాన్స్ చేయడం కొత్త కాదు. కావాలా సాంగ్ కి జపాన్ బ్రాండ్ అంబాసిడర్ డాన్స్ చేసి వీడియో పెట్టేసరికి.. తలైవా ఫ్యాన్స్ అంతా వీడియోని వైరల్ చేస్తూ.. ఖుషి అవుతున్నారు. ఇక జైలర్ సినిమా ప్రస్తుతం అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్స్ లో విపరీతంగా ఆకట్టుకుంటూ.. అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమాలో రజినీతో పాటు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళం స్టార్ మోహన్ లాల్ కూడా నటించడం విశేషం. ఇక భారీ అంచనాల మధ్య జైలర్.. విడుదలైన నాలుగు రోజుల్లోనే అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసేసింది. మరి కావాలా సాంగ్ పై జపనీయుల డాన్స్ ఎలా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.