iDreamPost
android-app
ios-app

జానీ మాస్టర్ కేసు.. MAA అసోసియేషన్ కి మంచు మనోజ్ స్పెషల్ రిక్వెస్ట్..

  • Published Sep 19, 2024 | 3:23 PM Updated Updated Sep 19, 2024 | 3:23 PM

Johnny Master Case: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూడు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసుకు సంబంధించిన చర్చలే జరుగుతున్నాయి. ఓ యువతిపై లైంగిక వేధింపులు, అత్యాచార ఆరోపణలపై గోవాలో అరెస్ట్ చేశారు.

Johnny Master Case: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూడు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసుకు సంబంధించిన చర్చలే జరుగుతున్నాయి. ఓ యువతిపై లైంగిక వేధింపులు, అత్యాచార ఆరోపణలపై గోవాలో అరెస్ట్ చేశారు.

జానీ మాస్టర్ కేసు.. MAA అసోసియేషన్ కి మంచు మనోజ్ స్పెషల్ రిక్వెస్ట్..

సినీ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న జానీ మాస్టర్ లైంగిక, అత్యాచార ఆరోపణపై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఐదు రోజులు పరారీలో ఉన్న జానీ మాస్టర్ ని గోవాలో సైబరాబాద్ SOT పోలీసుల అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి హైదరాబాద్ కి తరలించారు. రేపు ఉప్పర్‌పల్లి కోర్టుకు జానీ మాస్టర్ ని హాజరు పర్చే అవకాశం ఉందని అంటున్నారు.జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేస్తున్న ఓ యువతి తనను లైంగిక వేధింపులు, అత్యాచార ప్రయత్నం, పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నట్లు ఆయనపై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి సోషల్ మీడియాల ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా జానీ మాస్టర్ కేసు విషయంలో మంచు మనోజ్ స్పందించారు. వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్న జానీ మాస్టర్ అరెస్ట్ అంశం పై హీరో మంచు మనోజ్ సామాజిక మాధ్యంలో స్పందించారు..అలాగే ‘మా’ అసోసియేషన్ కి స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. జానీ మాస్టర్ మీరు ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. మీ‌పై వస్తున్న ఆరోపణలు చూస్తుంటే బాధగా ఉంది. కానీ, నిజం ఎప్పటికైనా బయటపడుతుంది.. అది తప్పో, ఒప్పో చట్టం నిర్ణయిస్తుంది. ఓ యువతి ఇలాంటి ఆరోపణలు చేసిందంటే దాని వెనుక ఎంత ఎమోషన్ ఉందో అర్థమవుతుంది. ఈ కేసు వేగంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులను నేను మనసారా అభినందిస్తున్నాను. చట్టానికి ఎవరూ అతీతులు కాదు.. జానీ మాస్టర్, మీరు నిజాన్ని ఎదుర్కొండి. మీరు అమాయకులైతే పోరాడండి. మీరు దోషి అని తేలితే నిర్భయంగా ఒప్పుకోండి.

ఈ సందర్భంగా ‘మా’ అసోయేషన్‌కి నా రిక్వెస్ట్. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేసి ఇండస్ట్రీలో మహిళలకు రక్షణగా ఉండండి.. వారి గొంతు వినపడేలా ప్రోత్సహించండి. సినీ పరిశ్రమకు వచ్చిన ఏ అమ్మాయి, మహిళ తాము ఒంటరిగా లేము అన్న ధైర్యం నింపండి. లైంగిక వేధింపులకు గురైన ఆడవారికి అండగా నిలుస్తున్న మా అసోసియేషన్‌కి నా ధన్యవాదాలు. మహిళలపై జరిగే అత్యాచారాల గురించి న్యాయం, గౌరవం అనేవి మాటల్లో కాకుండా చేతల్లో ఉండేలా సమ సమాజాన్ని నిర్మిద్దాం. ఈ పోరాటంలో ప్రతి తల్లి, సోదరి, కూతురు అందరికీ నేను ఎప్పుడూ అండగా ఉంటా అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం మంచు మనోజ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.