iDreamPost
android-app
ios-app

నేషనల్ అవార్డు తీసుకోవాలి.. దయచేసి బెయిల్ ఇప్పించండి: జానీ మాస్టర్

  • Published Oct 01, 2024 | 3:20 PM Updated Updated Oct 01, 2024 | 3:20 PM

Jani Master Case: తెలుగు ఇండస్ట్రీలో వరుసగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సెలబ్రెటీలు. తన వద్ద కొంతకాలంగా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న యువతిపై లైంగిక వేధింపులు, దాడులకు పాల్పపడినట్లు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై నార్సింగ్ లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

Jani Master Case: తెలుగు ఇండస్ట్రీలో వరుసగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సెలబ్రెటీలు. తన వద్ద కొంతకాలంగా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న యువతిపై లైంగిక వేధింపులు, దాడులకు పాల్పపడినట్లు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై నార్సింగ్ లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

నేషనల్ అవార్డు తీసుకోవాలి.. దయచేసి బెయిల్ ఇప్పించండి: జానీ మాస్టర్

ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లో లైంగిక వేధింపుల కేసులు తీవ్ర సంచలనాలు రేపుతున్నాయి. మొన్నటి వరకు ఇండస్ట్రీలో ప్రముఖులుగా చలామని అయిన వారు ఇప్పుడు లైంగిక, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటు జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లైంగిక ఆరోపణలు చేయగా కేసు నమోదు చేసుకొని పోలీసుల విచారణ అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా జానీ మాస్టర్ తనకు ఐదు రోజుల మద్యంతర బెయిల్ కోరుతో కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. నేడు పిటీషన్ పై విచారణ జరగనుంది. ఇప్పటికే రెగ్యూలర్ బెయిల్ పిటీషన్ ను దాఖలు చేయగా.. ఆ పిటీషన్ పై విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది రంగారెడ్డి ఫోక్సో కొర్టు. పూర్తి వివరాల్లోకి వెళితే..

జూనియర్ డ్యాన్సర్ పై లైంగిక దాడి కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం ఆయన చంచల్ గూడ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ కోరుతూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తనకు ఐదు రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని బెయిల్ పిటీషన్ లో కోరారు. ఢిల్లీలో ఉత్తమ నృత్య దర్శకుడిగా (నేషనల్ అవార్డు) అందుకోవాల్సి ఉందని కోర్టును జానీ తరుపు న్యాయవాదులు కోరారు. జానీ మాస్టర్ పిటీషన్ పై విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా కోర్టు అక్టోబర్ 7కు వాయిదా వేసింది. జానీ మాస్టర్ దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ పై నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. సదరు వ్యక్తికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కౌంటర్ పిటీషన్ లో పోలీసులు పేర్కొన్నారు. విచారణ సమయంలో బెయిల్ ఇవ్వవొద్దని కోర్టును కోరారు.

ఈ క్రమంలోనే పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయ స్థానం తదుపని విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది. తాజాగా జానీ మాస్టర్ తనకు మద్యంతర బెయిల్ మంజూరు చేయాలని వేసిన  పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. మరి జానీ మాస్టర్ పిటీషన్ పై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.  ఇదిలా ఉంటే.. జానీ మాస్టర్ వివాదం ఇండస్ట్రీలో పెద్ద దుమారమే చెలరేగుతుంది. కానీ మాస్టర్ వర్షన్ ప్రకారం.. తనపై కుట్ర జరుగుతుందని, ఉద్దేశ పూర్వకంగా తనను కార్నర్ చేస్తున్నారని.. బాధితురాలు చెప్పే మాటల్లో నిజం లేదని.. పెళ్లి చేసుకోవాలని ఆ యువతి మానసికంగా హింసించిందని జానీ మాస్టర్ పోలీసులతో వాపోయినట్లు వార్తలు వస్తున్నాయి.