Dharani
Janhvi Kapoor-Tirumala, Sridevi Birthday: తల్లి జయంతి సందర్భంగా జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ వివరాలు..
Janhvi Kapoor-Tirumala, Sridevi Birthday: తల్లి జయంతి సందర్భంగా జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ వివరాలు..
Dharani
శ్రీదేవి.. ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన తొలి తరం హీరోయిన్. అందం, అభినయంతో దక్షిణాదినే కాక యావత్ దేశాన్ని ఊర్రూతలూగించింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళం, హిందీ అనే తేడా లేకుండా అన్ని ప్రముఖ ఇండస్ట్రీల్లో పదుల సంఖ్యలో సినిమాలు చేసి.. రికార్డులు క్రియేట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కథాప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ.. ఈ తరం ప్రేక్షకులకు కూడా చేరువయ్యింది. ఇక తన కుమార్తె జాన్వీ కపూర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసే ప్రయత్నాల్లో ఉండగానే.. అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయింది. దుబాయ్ లో ఓ ప్రైవేటు ఫంక్షన్ కి హాజరైన శ్రీదేవి.. అక్కడే బాత్ టబ్ లో కార్డియాక్ అరెస్ట్ తో కన్ను మూసింది. ఆమె మరణంపై అనేక సంచలన ఆరోపణలు వచ్చాయి.
ఇదిలా ఉండగా నేడు శ్రీదేవి జయంతి. ఈ క్రమంలో తల్లి పుట్టిన రోజు నేపథ్యంలో ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. జాన్వీ కపూర్ కి తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో భక్తి, నమ్మకం కూడా. తన బర్త్ డే, తల్లి జయంతి, ఇతర ప్రత్యక సందర్భాల్లో తిరుపతి సందర్శిస్తుంటుంది. ఈ క్రమంలో నేడు అనగా మంగళవారం తన తల్లి శ్రీదేవి జయంతి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది జాన్వీ కపూర్. మెట్ల దారిలో కొండపైకి చేరుకుంది. తర్వాత స్వామి వారిని దర్శించకుంది. ఆలయ పూజారులు పూజలు చేసి.. ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. జాన్వీ తిరుమల సందర్శన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
తల్లి జయంతి సందర్భంగా తన ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది జాన్వీ కపూర్. చిన్నప్పుడు తల్లితో కలిసి ఉన్న ఫొటోని షేర్ చేసింది. ఇక బాలీవుడ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా జాన్వీ కపూర్.. సాలిడ్ హిట్టు కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు దేవర సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. ఇదే కాక.. రామ్ చరణ్ తదుపరి సినిమాలో కూడా నటించే ఛాన్స్ కొట్టేసింది జాన్వీ కపూర్. ఈ రెండు చిత్రాలు విజయం సాధిస్తే.. కొన్నాళ్ల పాటు జాన్వీ టాలీవుడ్ ని ఏలేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు.