iDreamPost
android-app
ios-app

దేవరలో తన పాత్ర ఎలా ఉంటుందో చెప్పేసిన జాన్వీ కపూర్!

Janhvi Kapoor Reveals Her Character In Devara Movie: కొరటాల శివ- జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న దేవర పార్ట్ 1కి సంబంధించి హీరోయిన్ జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. టాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే వరుస ప్రాజెక్టుల్లో ఛాన్సులు కొట్టేస్తోంది.

Janhvi Kapoor Reveals Her Character In Devara Movie: కొరటాల శివ- జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న దేవర పార్ట్ 1కి సంబంధించి హీరోయిన్ జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. టాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే వరుస ప్రాజెక్టుల్లో ఛాన్సులు కొట్టేస్తోంది.

దేవరలో తన పాత్ర ఎలా ఉంటుందో చెప్పేసిన జాన్వీ కపూర్!

జూనియర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న పాన్ ఇండియా సినిమా దేవర కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ నుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా కూడా వదలకుండా వైరల్ చేస్తున్నారు. అయితే దేవర నుంచి సరైన అప్ డేట్ వచ్చి చాలా రోజులు అవుతోంది. గాసిప్స్ అయితే వస్తున్నాయి. కానీ, అప్ డేట్స్ మాత్రం రావడం లేదు. ఇప్పుడు దేవర హీరోయిన్ జాన్వీ కపూర్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. షూటింగ్, సాంగ్స్, సినిమాలో తన పాత్ర గురించి కూడా చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇప్పుడు జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

జాన్సీ కపూర్ దేవర సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ విడుదల కూడా కాకుండానే.. రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు ఇంకా మరిన్ని ప్రాజెక్టులు టాలీవుడ్ నుంచి రానున్నాయి అనే టాక్ కూడా ఉంది. అయితే ఆమె తెలుగులో ఒక్క సినిమా కూడా ఇంకా రిలీజ్ కాకుండానే.. ఆఫర్స్ క్యూ కట్టడంపై సంతోషం వ్యక్తం చేస్తోంది. అయితే శ్రీదేవి కుమార్తె టాలీవుడ్ కి రావాలి అని ప్రేక్షకులు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. వారి కోరికను తీరుస్తూ దేవరతో సెప్టెంబర్ 27న జాన్వీ కపూర్ తారక్ సరసన కనిపించబోతోంది. ఇప్పుడు ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

“దేవర సినిమాలో నా పాత్ర సెకండాఫ్ లోనే ఎక్కువ ఉంటుంది. నేను జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సాంగ్ చేశాను. నెక్ట్స్ సాంగ్ షూట్ కోసం వెయిట్ చేస్తున్నాను. నాకు జూనియర్ ఎన్టీఆర్ తో సాంగ్ చేయడం నాకు తారక్ తో డ్యాన్స్ చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది” జాన్వీ కపూర్. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ మూవీలో జాన్వీ కపూర్ పాత్ర నెగిటివ్ రోల్ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. దేవర మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తైనట్లు చెబుతున్నారు. ఇంకా కాస్త షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ మూవీ రిలీజ్ కాకుండానే.. ఆర్సీ 16లో జాన్వీ కపూర్ ఛాన్స్ కొట్టేసింది. ఆ మూవీ కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది అని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. మరి.. దేవర సినిమాకి సంబంధించి జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş