iDreamPost
android-app
ios-app

జాన్వీకి తిరుమల శ్రీవారు అంటే అంత భక్తా.. మోకాళ్లపై మెట్లేక్కెస్తూ..

  • Published Mar 21, 2024 | 3:40 PM Updated Updated Mar 21, 2024 | 3:40 PM

Jahnvi Kapoor- Tirumala: జాన్వీ కపూర్ కు పాన్ ఇండియా లెవల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాగే ఆమెకు తిరుమల శ్రీవారిపై ఉన్న భక్తి కూడా అందరికీ తెలిసిందే. అయితే ఆమెకు ఏ స్థాయిలో భక్తి ఉందో ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చు.

Jahnvi Kapoor- Tirumala: జాన్వీ కపూర్ కు పాన్ ఇండియా లెవల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాగే ఆమెకు తిరుమల శ్రీవారిపై ఉన్న భక్తి కూడా అందరికీ తెలిసిందే. అయితే ఆమెకు ఏ స్థాయిలో భక్తి ఉందో ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చు.

  • Published Mar 21, 2024 | 3:40 PMUpdated Mar 21, 2024 | 3:40 PM
జాన్వీకి తిరుమల శ్రీవారు అంటే అంత భక్తా.. మోకాళ్లపై మెట్లేక్కెస్తూ..

బోనీకపూర్- శ్రీదేవిల పెద్దకుమార్తెగా జాన్వీ కపూర్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. వచ్చిన అవకాశాలను వాడుకుంటూ హీరోయిన్ గా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తోంది. ఇప్పుడు ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ కి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు ఒకేసారి డబుల్ ధమాకా ఇచ్చేసింది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రామ్ చరణ్- బుచ్చిబాబు ప్రాజెక్ట్ లో కూడా హీరోయిన్ గా చేస్తోంది. అయితే జాన్వీకి ఇక్కడి ఆచారాలు అన్న.. తిరుమల శ్రీవారు అన్న ఎంత ప్రేమో ఒకసారి చూడండి.

శ్రీదేవి కుటుంబానికి తిరుమల శ్రీవారు అంటే ఎంత భక్తో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీదేవి బతికున్న రోజుల్లో ఆవిడ తన ప్రతి సినిమా రిలీజ్ కి తిరుమల శ్రీవారిని దర్శించుకునేది. అదే అలవాటు పిల్లలకు కూడా వచ్చింది. జాన్వీ కపూర్ కు తిరుమల శ్రీవారు అంటే ఎనలేని భక్తి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జాన్వీకపూర్ తరచూ తిరుమలకు వెళ్తూనే ఉంటుంది. అయితే ఆమెకు శ్రీవారి అంటే ఎంత భక్తో చాలామందికి తెలియకపోవచ్చు. ఇటీవల జరిగిన ఒక ఘటన ఆ విషయాన్ని అందరికీ తెలిసొచ్చేలా చేసింది. విషయం ఏంటంటే.. జాన్వీకపూర్ మార్చి 6న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. ఆమెతోపాటు జాన్వీ రూమర్డ్ బాయ్ ఫ్రెండ్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్ ఆరీ కూడా ఉన్నారు.

Jahnavi kapoor

అయితే తాజాగా ఆరీ తిరుమల అడ్వెంచర్స్ అంటూ అప్పటి వీడియో ఇప్పుడు రిలీజ్ చేశాడు. ఆ రోజు జరిగిన మొత్తం సంఘటనలను వ్లాగ్ రూపంలో విడుదల చేశాడు. ఆ వ్లాగ్ లో జాన్వీ కపూర్ మొదట చెన్నై వెళ్లి.. అక్కడి నుంచి కారులో తిరుపతి చేరుకుంది. ఆ తర్వాత కాలి నడకన తిరుమల కొండెక్కింది. మధ్యలో మోకాళ్ల పర్వతం వద్ద జాన్వీ కపూర్- శిఖర్ మోకాళ్లపై మెట్లెక్కారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక స్టార్ నిర్మాత- స్టార్ హీరోయిన్ కూతురు.. పాన్ ఇండియా హీరోయిన్ అయ్యుండి కూడా జాన్వీ కపూర్ ఇలా మోకాళ్లపై తిరుమల కొండ ఎక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అలాగే ఆమెపై పొగ్తల వర్షం కురిసేలా చేస్తోంది.

ఇంక సినిమాల విషయానికి వస్తే.. జాన్వీ కపూర్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్- రామ్ చరణ్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆర్సీ16 సినిమాకి బుధవారం పూజాకార్యక్రమం కూడా నిర్వహించారు. ఎప్పుడెప్పుడు తెలుగు సినిమాలో చేస్తుంది అనుకుంటే ఒకేసారి రెండు సినిమాలతో ఆశ్చర్యానికి గురిచేసింది. అలాగే ఆర్సీ 16 పూజ తర్వాత సినిమా టీమ్ మొత్తం రామ్ చరణ్ ఇంట్లో సందడి చేశారు. జాన్వీ కపూర్ కూడా రామ్ చరణ్ తో కలిసి సరదాగా గడిపింది. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. మరి.. అంత సెలబ్రిటీ అయ్యుండి కూడా జాన్వీ కపూర్ తిరుమల మెట్లు మోకాళ్లపై ఎక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetcup girişgrandpashabet