Somesekhar
James Cameron-SS Rajamouli: హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ మరోసారి దర్శకదీరుడు రాజమౌళిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
James Cameron-SS Rajamouli: హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ మరోసారి దర్శకదీరుడు రాజమౌళిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Somesekhar
SS రాజమౌళి.. భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన అగ్రదర్శకుడు. ఏ సినిమా చేసినా దాన్ని ఓ బొమ్మలా అందంగా చెక్కుతాడు. అందుకే రాజమౌళిని అభిమానులు ముద్దుగా జక్కన్న అని పిలుచుకుంటారు. RRR సినిమాతో హాలీవుడ్ కోటలను బద్దలు కొట్టి తెలుగోడి సత్తా ఏంటో నిరూపించాడు. ఇక ఈ సినిమాతో పలు అవార్డులను కొల్లగొట్టడమే కాకుండా.. హాలీవుడ్ లో తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఇక జక్కన్న టేకింగ్ గురించి హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి జక్కన్నపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఈ బడా డైరెక్టర్.
జేమ్స్ కామెరూన్.. ప్రపంచ దిగ్గజ దర్శకుల్లో అగ్రస్థానంలో ఉంటాడు. తీసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. వరల్డ్ వైడ్ గా కోట్లలో అభిమానులను సంపాదించుకున్నాడు. ఆస్కార్ అవార్డులు ఆయన సినిమాలకు నడుచుకుంటూ వస్తాయి. ఇంతటి దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి టేకింగ్ కు ఫిదా అయ్యాడు. జక్కన్న తీసిన ఆర్ఆర్ఆర్ మూవీ గురించి కామెరూన్ గతంలోనే మాట్లాడిన వీడియో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆర్ఆర్ఆర్ మూవీ ప్రస్తావన తెచ్చాడు. ఇటీవల లాస్ ఏంజిల్స్ లో మారియట్ బర్ బ్యాంక్ ఎయిర్ పోర్ట్ లో హోటల్ లో 51వ వార్షిక సాటర్న్ అవార్డుల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాలీవుడ్ అతిరథ మహారథులు హాజరైయ్యారు. వారితో పాటుగా అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ప్రత్యేక గెస్ట్ గా వచ్చాడు.
ఈ సందర్భంగా డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ..”నేను స్టీవెన్ స్పిల్ బర్గ్, లూకాస్ లాంటి ప్రముఖుల నుంచి ఎంతో స్ఫూర్తి పొందుతాను. అలాగే ఇండియాలో రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకులు తీసిన ఆర్ఆర్ఆర్ వంటి అద్భుతమైన మూవీలతో ఇండియన్ సినిమా స్థాయిని పెంచారు” అంటూ ఆర్ఆర్ఆర్ మూవీని ప్రస్తావించి అందరిని ఆశ్చర్యపరిచాడు. దీంతో అక్కడి స్టేడియంలో చప్పట్లు మారుమ్రోగాయి. కాగా.. గతంలో వీరిద్దరు కలుసుకున్నప్పుడు ఇద్దరం కలిసి సినిమా తీద్దామని అన్న మాటలు వైరల్ అయిన సంగతి తెలిందే. దీంతో రాజమౌళి హాలీవుడ్ ను వెంటాడుతున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి మరోసారి దిగ్గజ దర్శకుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటుగా రాజమౌళిని గుర్తుకు తేవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: గూఢచారి-2 లో స్పెషల్ రోల్! శేషు సరైనోడిని దింపాడు!