iDreamPost
android-app
ios-app

సూపర్ స్టార్ క్రేజ్! జైలర్ రిలీజ్ రోజు వాళ్లకు సెలవు!

  • Author ajaykrishna Updated - 08:30 AM, Tue - 8 August 23
  • Author ajaykrishna Updated - 08:30 AM, Tue - 8 August 23
సూపర్ స్టార్ క్రేజ్! జైలర్ రిలీజ్ రోజు వాళ్లకు సెలవు!

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సూపర్ స్టార్ రజినీకాంత్ మేనియా వేరు.. ఆయన సినిమాలకున్న క్రేజ్ వేరు. రజినీ నుండి కొత్త సినిమా వస్తుందంటే.. రిలీజ్ రోజు థియేటర్స్ దగ్గర పెద్ద పండుగ వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా రజినీ చేసే సినిమాల ఫలితాల సంగతి పక్కనపెడితే.. బిగ్ స్క్రీన్ పై ఆయన కనిపిస్తే ఫ్యాన్స్ చేసుకునే సంబరాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఇప్పుడు మరోసారి థియేటర్స్ లో ఆ రేంజ్ సందడి చేసేందుకు రెడీ అయిపోయారు సూపర్ స్టార్ అభిమానులు. రజినీ సినిమా అంటే.. అన్ని వయసుల వారు థియేటర్స్ కి వెళ్లి సినిమా చూస్తారనే సంగతి తెలిసిందే. ఈసారి ఏకంగా భారీ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు రజినీ.

రజినీ నటించిన కొత్త సినిమా జైలర్. కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా.. ఆగష్టు 10న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి అన్ని పాటలు, ట్రైలర్, ప్రచార కార్యక్రమాలు ఫ్యాన్స్ లో అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా అనిరుధ్ అందించిన పాటలు జనాల నోళ్లలో నానుతున్నాయి. జైలర్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ఎంతో ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో.. జైలర్ ఫ్యాన్స్ కి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కొన్ని కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. అదేంటంటే.. పలు కంపెనీలు తమ ఉద్యోగులకు జైలర్ రిలీజ్ రోజు హాలిడే ఇవ్వనున్నట్లు సమాచారం.

ఈ రూల్ రాష్ట్రమంతటా కాదు. బెంగళూరు, చెన్నైకి చెందిన కొన్ని కంపెనీలు మాత్రమే తమ ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నాయి. పైగా జైలర్ మూవీ టికెట్స్ కూడా కంపెనీలే అరేంజ్ చేస్తుండటం విశేషం. ఈ విషయం తెలిసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఆనందంతో కాలర్ ఎగరేస్తున్నారు. ఇక చాలా గ్యాప్ తర్వాత రజినీ నుండి మాస్ యాక్షన్ మూవీ చూడబోతున్నారు. ఆల్రెడీ ట్రైలర్ లో చూసిన యాక్షన్ కి రెట్టింపు స్థాయిలో సీక్వెన్సులు ఉన్నాయట. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో రమ్యకృష్ణ, తమన్నాలతో పాటు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళం స్టార్ మోహన్ లాల్ కీలకపాత్రలలో నటించారు. వీరి క్యారెక్టర్స్ కి సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి విషయాలు రిలీజ్ చేయలేదు మేకర్స్. ఇక సన్ పిక్చర్స్ వారు జైలర్ ని రిలీజ్ చేస్తున్నారు. మరి జైలర్ మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetavrupabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet