iDreamPost
android-app
ios-app

‘జైలర్’ సక్సెస్.. రజినీకి రూ. 100 కోట్ల చెక్, బిఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

  • Author ajaykrishna Updated - 01:53 PM, Fri - 1 September 23
  • Author ajaykrishna Updated - 01:53 PM, Fri - 1 September 23
‘జైలర్’ సక్సెస్.. రజినీకి రూ. 100 కోట్ల చెక్, బిఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

సూపర్ స్టార్ రజినీకాంత్.. ‘జైలర్’ మూవీతో చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ చూశారు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన యాక్షన్ కామెడీ డ్రామా.. వరల్డ్ వైడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని అత్యధిక లాభాలను కొల్లగొట్టింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ. 124 కోట్ల వరల్డ్ వైడ్ టార్గెట్ తో థియేటర్స్ లో విడుదలైంది. ఆగష్టు 10న రిలీజ్ అయిన ఈ సినిమా.. ఫస్ట్ డే నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని.. రజినీ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే జైలర్ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని కంప్లీట్ చేసి.. లాభాల బాటపట్టింది.

ఇక ఐదవ రోజు నుండి జైలర్ బాక్సాఫీస్ హవా ఓ రేంజ్ లో సాగుతూ వచ్చింది. మొత్తానికి విడుదలైన మూడు వారాలకు జైలర్ రూ. 620 కోట్లకు పైగా గ్రాస్ ని.. రూ. 280 కోట్లకు పైగా షేర్ ని ఖాతాలో వేసుకుంది. దీంతో సుమారు రూ. 150 కోట్లకు పైగా షేర్ నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టింది. అయితే.. రోబో 2.o తర్వాత రజినీ నుండి ఈ రేంజ్ సక్సెస్ చూడలేదు. కానీ.. గ్యాప్ వచ్చినప్పటికీ.. జైలర్ తో ఆయన మరోసారి ట్రెండ్ సెట్టర్ ని ప్రూవ్ చేసుకున్నారు. ఈ యాక్షన్ మూవీలో.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళం స్టార్ మోహన్ లాల్ స్పెషల్ అప్పియరెన్స్ తో మెప్పించగా.. తమన్నా, రమ్యకృష్ణ, మిర్ణా మీనన్ కీలకపాత్రలు పోషించారు.

జైలర్ కి ప్రధాన బలం.. అనిరుధ్ మ్యూజిక్. సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి చేర్చాడు. థియేటర్స్ లో రజినీ ఎంట్రీ వచ్చినప్పుడల్లా అనిరుధ్ తన అభిమానాన్ని మ్యూజిక్ తో చాటుకున్నాడు. అయితే.. జైలర్ కి ఊహించని లాభాలు రావడంతో.. సూపర్ స్టార్ కి నిర్మాత కళానిధి మారన్ మరో చెక్కుతో పాటు BMW కారు అందించారు. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. రజినీకి జైలర్ నిర్మాత దాదాపు రూ. 100 కోట్ల చెక్ అందించినట్లు తెలుస్తోంది. మరి నిర్మాత ఇచ్చిన చెక్ పై ‘ది రియల్ రికార్డు మేకర్’ అని రాసి ఉండటం విశేషం. సో.. జైలర్ నిర్మాతకే కాదు.. రజినీకి కూడా లాభాలే తెచ్చిందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. మరి జైలర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet