iDreamPost
android-app
ios-app

జైలర్ మాస్ జాతర! రెండో రోజు ఎంత వసూల్ చేసిందంటే..?

  • Author ajaykrishna Updated - 03:17 PM, Sat - 12 August 23
  • Author ajaykrishna Updated - 03:17 PM, Sat - 12 August 23
జైలర్ మాస్ జాతర! రెండో రోజు ఎంత వసూల్ చేసిందంటే..?

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా.. ఇటీవల విడుదలై కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో.. రమ్యకృష్ణ, తమన్నాలతో పాటు మలయాళం స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలలో నటించారు. మొత్తానికి ఆగష్టు 10న వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకొచ్చిన జైలర్.. ముందస్తు అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ వైపు పరుగులు పెడుతోంది. అనిరుధ్ అందించిన సాంగ్స్ తో పాటు ట్రైలర్ కూడా హైప్ క్రియేట్ చేయడంతో.. ఫస్ట్ డే ఓపెనింగ్ కలెక్షన్స్ రూ. 95 కోట్లకు పైగా రాబట్టింది జైలర్.

ఈ దెబ్బకు చాలా గ్యాప్ తర్వాత రజినీ స్టామినా ప్రూవ్ చేస్తూ జైలర్ థియేటర్స్ లో రన్ అవుతుంది. అయితే.. ఫస్ట్ డే సూపర్ హిట్ టాక్ వచ్చేసరికి.. సెకండ్ డే కూడా మంచి వసూళ్లు నమోదు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం ఆదివారం లోపు అయిపోతుంది అని అంటున్నారు. అయితే.. జైలర్ రెండో రోజుకు సంబంధించి కలెక్షన్స్ డీటెయిల్స్ బయటికి వచ్చాయి. రెండో రోజు తెలుగు రాష్ట్రాలలో జైలర్.. సాలిడ్ నెంబర్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే.. వరల్డ్ వైడ్ చూసుకుంటే.. జైలర్ మూవీ రెండు రోజులకు గాను ఏకంగా రూ. 160 కోట్లకు పైగా గ్రాస్ అందుకుందని సమాచారం.

జైలర్ రెండు రోజుల కలెక్షన్స్ చూస్తే..

  • తమిళనాడు: 46 కోట్లు
  • ఏపీ, తెలంగాణ: 17 కోట్లు
  • కేరళ: 11 కోట్లు
  • కర్ణాటక: 16 కోట్లు
  • రెస్టాఫ్ ఇండియా: 5 కోట్లు
  • ఓవర్సీస్: 70 కోట్లు

వరల్డ్ వైడ్ రూ. 165 కోట్లు(గ్రాస్) వసూల్ అయినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తెలుగులో 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన జైలర్.. అంచనాలను బీట్ చేస్తూ.. రెండు రోజుల్లో 17 కోట్లు గ్రాస్ వసూల్ చేసింది. అంటే.. సుమారు రూ. 9.5 కోట్ల షేర్ రాబట్టినట్లు సమాచారం. మరి జైలర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişjojobet güncel girişMadridbetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet