iDreamPost
android-app
ios-app

జైలర్ మూవీలో నటసింహం బాలయ్య! ఆసక్తిరేపుతున్న డైరెక్టర్ వ్యాఖ్యలు!

  • Author ajaykrishna Updated - 11:08 AM, Sat - 12 August 23
  • Author ajaykrishna Updated - 11:08 AM, Sat - 12 August 23
జైలర్ మూవీలో నటసింహం బాలయ్య! ఆసక్తిరేపుతున్న డైరెక్టర్ వ్యాఖ్యలు!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘జైలర్’. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కలెక్షన్స్ పరంగాను పాత రికార్డులను తిరగరాస్తోంది జైలర్. మొదటి రోజే దాదాపు రూ. 95 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. మరోసారి సూపర్ స్టార్ స్టామినాని ప్రేక్షకులకు చూపించింది. ఈ సినిమాలో తమన్నా, రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కీలకపాత్రలలో నటించారు. అయితే.. చాలా గ్యాప్ తర్వాత రజినీ నుండి సూపర్ హిట్ సినిమా రావడంతో.. వరల్డ్ వైడ్ రజినీ ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో రజినీని నెక్స్ట్ లెవెల్ లో ప్రెజెంట్ చేసినందుకు డైరెక్టర్ నెల్సన్ ని.. తన మ్యూజిక్ తో సినిమాని ఎలివేట్ చేసినందుకు అనిరుధ్ ని స్పెషల్ గా అభినందిస్తున్నారు. కాగా.. జైలర్ మూవీలో టాలీవుడ్ యాక్టర్ సునీల్ ఓ చిన్న రోల్ లో మెరిసిన సంగతి తెలిసిందే. అయితే.. సునీల్ కాకుండా ఓ పవర్ ఫుల్ పాత్ర కోసం నటసింహం నందమూరి బాలకృష్ణను అనుకున్నాడట డైరెక్టర్ నెల్సన్. ఈ విషయాన్నీ స్వయంగా తానే చెప్పేసరికి.. అరెరే రజినీ – బాలయ్యలను ఒకే స్క్రీన్ పై చూసే అవకాశం మిస్ అయ్యిందే అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అసలు ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళ్తే.. ఈ సినిమాలో రజినీ సాధారణ జైలర్ గా కనిపిస్తూనే.. నెక్స్ట్ లెవెల్ యాక్షన్ ని పండించాడు.

డైరెక్టర్ నెల్సన్ మాట్లాడుతూ.. “జైలర్ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ల మాదిరి పవర్ ఫుల్ క్యామియో రోల్ కోసం బాలకృష్ణను అనుకున్నాను. కానీ.. స్క్రిప్ట్ కు తగ్గట్టుగా ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేయలేకపోయాను. అందుకే తర్వాత ఆ ఆలోచన మానుకున్నాను” అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దీంతో రజినీ.. బాలయ్య కాంబినేషన్ లో ఒక్క సీన్ పడినా బాగుండేది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ.. ఏదేమైనా స్క్రిప్ట్ లో కుదిరితేనే సాధ్యం అవుతుంది కాబట్టి.. ఫ్యూచర్ లో బాలయ్యతో సినిమా చేస్తానేమో అని మాత్రం చెప్పాడు డైరెక్టర్. ప్రస్తుతం నెల్సన్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి జైలర్ లో బాలయ్య ఉండి ఉంటే ఎలా ఉండేది మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişgrandpashabetcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbetjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet