iDreamPost
android-app
ios-app

జై మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు సూపర్ ఉమెన్‌గా దూసుకెళుతోంది

తేజ తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చిత్రాల్లో ఒకటి జై. ఇందులో నవదీప్ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఇందులో హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు సూపర్ ఉమెన్‌గా..

తేజ తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చిత్రాల్లో ఒకటి జై. ఇందులో నవదీప్ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఇందులో హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు సూపర్ ఉమెన్‌గా..

జై మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు సూపర్ ఉమెన్‌గా దూసుకెళుతోంది

కొత్త వాళ్లతో సినిమాలు తీసి.. హిట్ కొడుతుంటాడు దర్శకుడు తేజ. తన తొలి సినిమా చిత్రం నుండి ఇదే పంథాను అనుసరించాడు. అప్పుడప్పుడు మినహాయించి.. ఎక్కువగా న్యూటాలెంట్‌తోనే పిక్చర్స్ రూపొందించాడు. ఉదయ్ కిరణ్ మొదలుకుని దగ్గుబాటి అభిరామ్ వరకు ఆయన పరిచయం చేసిన నటులే. వారిలో ఒకరు నవదీప్. అతడు హీరోగా జై మూవీని తెరకెక్కించాడు. దేశ భక్తి, లవ్ స్టోరీ మిళితంగా వచ్చింది ఈ చిత్రం. అప్పటి వరకు తన సినిమాలకు ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అందించగా.. ఈ మూవీకి ఛేంజ్ చేసి.. ఆ ప్లేసులో అనూప్ రూబెన్స్‌ను తీసుకున్నాడు. స్వాతంత్ర్య దినోత్సవం వచ్చిందంటే చాలు దేశం మనదే.. తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే సాంగ్ గుర్తుకు రాక మానదు. అలాగే ఎన్నో ఊసులో చిన్ని గుండెలోనా పాటలు ఇప్పటికీ వీనుల విందుగా ఉంటాయి.

ఇక ఇందులో నవదీప్‌కు జోడీగా నటించిన అమ్మాయి గుర్తుందా.. ఆమె ఎవరో.. ఏం చేస్తుందో తెలుసా..? ఆ నటి పేరు సంతోషి శ్రీకర్ . ఆమె తమిళ టెలివిజన్ నటి పూర్ణిమ కూతురు. అలాగే.. ప్రముఖ సీనియర్ నటుడు ప్రసాద్ బాబుకు స్వయంగా కోడలు. ఇప్పుడు ఎంటర్ ప్రెన్యూయర్‌గా రాణిస్తుంది. ప్లస్ బోటిక్ అండ్ బ్యూటీ లాంగ్ పేరుతో బిజినెస్ రన్ చేస్తుంది. మేకప్ క్లాసెస్, శారీ డ్రాపింగ్ వంటి వాటిల్లో శిక్షణనిస్తూ ఉంటోంది. ఆమెకు చెన్నై, రాజమండ్రి, హైదరాబాద్ నగరాల్లో బొటిక్స్ ఉన్నాయి. అంతేకాదూ వివిధ ప్రాంతాల్లో క్లాసులు నిర్వహిస్తూ.. ఔత్సాహికులకు శిక్షణనిస్తూ ఉంటుంది. విద్యార్థులు నేర్చుకుని నిపుణులవుతుంటే సంబరపడిపోతూ ఉంటుంది. వారి విజయాన్ని తన విజయంగా భావిస్తూ ఉంటుంది. ఆమె భర్త కూడా ఆమెకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఉంటారు.

santhoshi plush

ఆమె భర్త శ్రీకర్ కూడా నటుడే. సంతోషి శ్రీకర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను విజయవాడలో పుట్టినప్పటికీ.. పెరిగింది చెన్నైలో అని తెలిపింది. జై సినిమాతో పాటు ఆర్య సినిమాలోనూ హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చిందని.. కానీ జై సినిమాలోనే నటించాను అని తెలిపింది సంతోషి. ఇల్లు తాకట్టు పెట్టి మరీ బిజినెస్ పెట్టినట్టు తెలిపింది సంతోషి శ్రీకర్. ఇప్పుడు సక్సెస్ ఫుల్ ఉమెన్‌గా దూసుకెళుతుంది. 2000లో పెంగల్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. హీరోయిన్, సెకండ్ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించింది. జై తర్వాత ఆమె నువ్వొస్తానంటే నేనొద్దంటానాలో శ్రీహరి ఇంట్లో పనిచేసే అమ్మాయిగా కనిపిస్తుంది. జాగ్రత్త అంటే వస్తువులు పడేసేది ఈ బ్యూటీనే.. ఈ సినిమాకు ఆమెకు బెస్ట్ ఫీమేల్ కమెడియన్ కింద నంది అవార్డు కూడా వచ్చింది. ఒక్కడే, బంగారం, ఢీ చిత్రాల్లో కూడా నటించింది ఈమె. ప్రస్తుతం మాత్రం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి.. బిజినెస్ రంగంలో దూసుకెళుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Santhoshi Gopala Krishnan (@santhoshiplush)