iDreamPost
android-app
ios-app

జై హనుమాన్ కోసం వెయిట్ చేయక తప్పదా !

  • Published Sep 27, 2025 | 10:11 AM Updated Updated Sep 27, 2025 | 10:11 AM

మళ్లీ సంక్రాంతి సీజన్ వచ్చిందంటే తేజ సజ్జా హనుమాన్ సినిమా వచ్చి రెండేళ్లు గడిచిపోతుంది. ఇక జై హనుమాన్ సినిమా ఎప్పుడు వస్తుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంతా సవ్యంగా జరిగి ఉంటె ఈపాటికి కనీసం పాతిక శాతం షూటింగ్ అయినా కంప్లీట్ అయ్యి ఉండేదేమో అని టాక్.

మళ్లీ సంక్రాంతి సీజన్ వచ్చిందంటే తేజ సజ్జా హనుమాన్ సినిమా వచ్చి రెండేళ్లు గడిచిపోతుంది. ఇక జై హనుమాన్ సినిమా ఎప్పుడు వస్తుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంతా సవ్యంగా జరిగి ఉంటె ఈపాటికి కనీసం పాతిక శాతం షూటింగ్ అయినా కంప్లీట్ అయ్యి ఉండేదేమో అని టాక్.

  • Published Sep 27, 2025 | 10:11 AMUpdated Sep 27, 2025 | 10:11 AM
జై హనుమాన్ కోసం వెయిట్ చేయక తప్పదా !

మళ్లీ సంక్రాంతి సీజన్ వచ్చిందంటే తేజ సజ్జా హనుమాన్ సినిమా వచ్చి రెండేళ్లు గడిచిపోతుంది. ఇక జై హనుమాన్ సినిమా ఎప్పుడు వస్తుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంతా సవ్యంగా జరిగి ఉంటె ఈపాటికి కనీసం పాతిక శాతం షూటింగ్ అయినా కంప్లీట్ అయ్యి ఉండేదేమో అని టాక్. తేజ సజ్జా నుంచి అయితే లేటెస్ట్ గా మిరాయ్ సినిమా వచ్చింది కానీ.. ప్రశాంత్ వర్మ నుంచి మాత్రం ఇంకో సినిమా రాలేదు. నందమూరి మోక్షజ్ఞతో సినిమా అన్నారు కానీ దాని మీద క్లారిటీ లేదు. అటు బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ తో కూడా సినిమా క్యాన్సిల్ అయింది.

ఇవి కాకుండా ప్రశాంత్ వర్మ చేతిలో మహాకాళి , అధీర అనే రెండు సూపర్ హీరో సినిమాలు ఉన్నాయి. వాటితో పాటు జై హనుమాన్ అనే అతి పెద్ద ప్రాజెక్ట్ ఒకటి ఉంది. అనౌన్స్ చేసి చాలా నెలలు అయింది. కానీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇక జై హనుమాన్ లో రిషబ్ శెట్టి ఉన్న సంగతి తెలిసిందే. కాంతారా చాప్టర్ 1 ప్రమోషన్స్ లో రిషబ్ శెట్టి జై హనుమాన్ గురించి క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు రిషబ్ శెట్టి ఫ్రీ అయ్యాడు అటు తేజ సజ్జా కూడా ఫ్రీ అయ్యాడు. ప్రశాంత్ వర్మ చేతిలో కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏమి లేవు. కాబట్టి ఇంకో మూడు నాలుగు నెలల్లో జై హనుమాన్ స్టార్ట్ అవ్వొచ్చు.

ఎంత లేదన్న అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంకో ఏడాదిన్నర సమయం పడుతుంది. అంటే 2027 లో ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది. అది కూడా అంతా అనుకున్నట్టు జరిగితేనే. మైత్రి మూవీ మేకర్స్ జై హనుమాన్ కోసం భారీ బడ్జెట్ పెట్టడానికి రెడీగానే ఉంది. ఇక జై హనుమాన్ నుంచి ముందు ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరీ ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.