Dharani
హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న జై హనుమాన్ సినిమాకు సంబంధించి దర్శకుడు ప్రశాంత్ వర్మ మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చాడు. ఆ వివరాలు..
హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా వస్తోన్న జై హనుమాన్ సినిమాకు సంబంధించి దర్శకుడు ప్రశాంత్ వర్మ మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చాడు. ఆ వివరాలు..
Dharani
సంక్రాంతి సందర్భంగా విడుదలైన హనుమాన్ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అతి తక్కువ బడ్డెట్‌తో అద్భుతమైన విజువల్స్ తో తెరకెక్కిన హనుమాన్ మూవీ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమా విడుదల తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు మారుమోగిపోయింది. రూ.40 కోట్లతో బడ్డెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కనివిని ఎరుగని రీతిలో ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. హనుమాన్ సినిమా విడుదల సమయంలోనే దీనికి సీక్వెల్‌గా జై హనుమాన్ సినిమా రాబోతుందని ప్రకటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ వివరాలు..
ఇప్పటికే జైహనుమాన్ స్క్రిప్ట్ వర్క్ మొదలైనట్లు ప్రశాంత్ వర్మ చెప్పారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి తాజాగా ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.. “అంజనాద్రి 2.0కి స్వాగతం” అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ కలిగించింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక వీడియోలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సముద్రం, అందులో మధ్యలో కొండలతో అంజనాద్రి 2.0ను అద్భుతంగా రూపొందించారు.
హనుమాన్ సినిమా కోసం దర్శకుడు ప్రశాంత్ వర్మ అంజనాద్రి అంటూ ఓ కల్పిత గ్రామాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హనుమాన్ కు సీక్వెల్ గా తెరకెక్కుతన్న జై హనుమాన్ కోసం కూడా ఇదే మాదిరిగా అంజనాద్రి 2.0ను సృష్టిస్తున్నారన్న మాట. ఈ విజువల్స్ చూస్తుంటే జై హనుమాన్ మరింత గ్రాండ్‌గా ఉండబోతుందని అర్థమవుతుంది. వీడియోలో విజువల్స్ చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. కళ్లు చెదిరిపోయాయ్ వర్మ.. అంటూ కామెంట్ చేస్తున్నారు
హనుమాన్ తో పోలిస్తే.. జైహనుమాన్ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది అని మేకర్స్ ముందే చెప్పారు. దాంతో జైహనుమాన్ మరింత గ్రాండ్ గా ఉంటుందని ప్రశాంత్ వర్మ ఇప్పటికే ప్రకటించారు. బడ్జెట్ విషయంలో కూడా ఏమాత్రం వెనుకాడకుండా తీయబోతున్నట్లు వెల్లడించారు. ఇక ఈ సీక్వెల్‌లో కూడా హనుమంతు పాత్రలో తేజ సజ్జా కొనసాగుతాడని కానీ హనుమాన్ పాత్రలో ఓ స్టార్ హీరో కనిపించబోతున్నట్లు చెప్పుకొచ్చారు.
అయితే ఆ స్టార్ హీరో ఎవరూ అనే విషయంపై మాత్రం ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఇక జై హనుమాన్ సినిమా కోసం పాన్ ఇండియా లెవల్లో ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. మొదటి పార్ట్‌తో పోలిస్తే ఇందులో గ్రాఫిక్స్ వర్క్‌తో పాటు కొత్త క్యారెక్టర్ల రాక కూడా ఉంటుందని భావిస్తున్నారు.
Welcome to Anjanadri 2.0! ⛰️ #JaiHanuman @ThePVCU pic.twitter.com/B3sPPfqgXP
— Prasanth Varma (@PrasanthVarma) March 31, 2024