iDreamPost
android-app
ios-app

అభిమానుల నినాదమే సినిమా టైటిల్

  • Published May 26, 2022 | 4:07 PM Updated Updated May 26, 2022 | 4:08 PM
  • Published May 26, 2022 | 4:07 PMUpdated May 26, 2022 | 4:08 PM
అభిమానుల నినాదమే సినిమా టైటిల్

అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ చేస్తున్న సినిమాగా దర్శకుడు గోపీచంద్ మలినేని మీద అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. షూటింగ్ వేగంగా జరుగుతోంది. వీలైతే దసరా లేదా దీపావళిని టార్గెట్ గా పెట్టుకుని చిత్రీకరణ జరుపుతున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి జై బాలయ్య టైటిల్ ని డిసైడ్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. త్వరలోనే ఒక పెద్ద ఈవెంట్ చేసి దానిమీద ప్రకటించే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఇంతకుముందు అన్నగారు, రెడ్డి గారు అని రెండు మూడు పేర్లు అనుకున్నారు కానీ అవేవి అందరికీ నచ్చేలా లేకపోవడంతో తర్జనభర్జనల తర్వాత జై బాలయ్యకే అందరి ఓటు పడిందట.

మాములుగా ఓ గుంపు కలిసినప్పుడు ఆనందాన్ని వ్యక్తం చేయడానికి జై బాలయ్య అనడం పరిపాటిగా మారింది. ఇక అభిమానుల గురించి చెప్పేదేముంది. దాన్నే టైటిల్ గా పెడితే ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో వేరే చెప్పాలా. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. క్రాక్ తరహాలోనే ఇందులో కూడా ఒంగోలు బ్యాక్ డ్రాప్ ఉన్నప్పటికీ బాలయ్య స్టైల్ లో హీరోయిజంతో పాటు కమర్షియల్ అంశాలు అన్నీ ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేశారట. గెటప్ ఆల్రెడీ బయటికి వచ్చేసింది కాబట్టి పవర్ ఫుల్ పోస్టర్ తో టైటిల్ ని రివీల్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి

ఇది పూర్తవ్వగానే బాలయ్య కొంచెం గ్యాప్ తీసుకుని అనిల్ రావిపూడి సినిమా మొదలుపెట్టేస్తారు. ఇప్పటికే ఫైనల్ వెర్షన్ దాదాపు లాక్ అయిపోయింది. ప్రియమణి జోడి కాగా వీళ్ళ కూతురిగా శ్రీలీల ఎంపికయ్యిందని ఆల్రెడీ దర్శకుడే చెప్పేశాడు కాబట్టి ఇంక డౌట్ అక్కర్లేదు. దీంతో పాటు ఆహా యాప్ కోసం బాలకృష్ణ చేయబోయే ఆన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ కూడా షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ప్రస్తుతం టీమ్ సెలబ్రిటీ లిస్టుని సిద్ధం చేసే పనిలో ఉంది . ఫస్ట్ సీజన్ బ్లాక్ బస్టర్ కావడంతో రెండోది అంతకు మించి ఉండాలన్న ఉద్దేశంతో పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇది సెప్టెంబర్ లో స్ట్రీమింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio