Krishna Kowshik
చిరంజీవి క్లాసిక్ హిట్ చిత్రాల్లో ఒకటి జగదీక వీరుడు-అతిలోక సుందరి. 1990లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. చిరంజీవి నటన, శ్రీదేవి అందంతో పాటు అమ్రీష్ పురి విలనిజం సినిమాకు ప్లస్. కాగా, ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులను భయపెట్టిన అమ్రీష్ పురి.. ఫ్యామిలీ గురించి ఈ విషయాలు తెలుసా..?
చిరంజీవి క్లాసిక్ హిట్ చిత్రాల్లో ఒకటి జగదీక వీరుడు-అతిలోక సుందరి. 1990లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. చిరంజీవి నటన, శ్రీదేవి అందంతో పాటు అమ్రీష్ పురి విలనిజం సినిమాకు ప్లస్. కాగా, ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులను భయపెట్టిన అమ్రీష్ పురి.. ఫ్యామిలీ గురించి ఈ విషయాలు తెలుసా..?
Krishna Kowshik
సినిమాలో కథానాయకుడు పాత్ర ఎంత బలమైనదో.. ప్రతినాయకుడి పాత్ర కూడా అంతే కీలకం. అప్పుడే సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది నెగిటివ్ రోల్స్ చేస్తూ సినీ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కానీ విలనీజానికే చెమటలు పట్టించిన నటుడు ఒకరున్నారు. ఆయనే అమ్రీష్ పూరి. హీరోలను సైతం డామినేట్ చేసే ఆహార్యం, గుండెల్లో దడ పుట్టించేలా డైలాగ్ డెలివరీ ఆయనకే సొంతం. అతడి యాక్టింగ్‌కు వణుకు పుట్టడమే కాదు, తెరపై గంభీరంగా కనిపిస్తే చిన్న పిల్లలైతే చుచ్చు పోసేసుకోవాల్సిందే. ఈ మెథడ్ ఆర్టిస్ట్ కమ్ లెజండరీ యాక్టర్ మన తెలుగులో కూడా నటించడం మనం చేసుకున్న అదృష్టం. ఈ బాలీవుడ్ యాక్టర్.. తెలుగులో కేవలం 8 సినిమాలు చేయగా.. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన జగదీక వీరుడు-అతిలోక సుందరి మూవీనే చాలా మందికి రిజిస్టర్ అయ్యింది.
1990లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీ హిట్. ఇందులో మాయల మాంత్రికుడిగా ‘కపాలికా రా’ అంటూ సరికొత్త ఆహార్యంతో ప్రేక్షకులను భయపెట్టాడు అమ్రీష్ పూరి. ఏ సినిమాలో ఆయన్ను చూసి చిన్నా, పెద్దా అని తేడా లేకుండా వణికి పోయేవారు. తన నెగిటివ్ పాత్రలతో అంతలా ప్రేక్షకుల మెదడులో పాతుకుపోయాడు. తెలుగులో అనుగ్రహం మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఆఖరి పోరాటం, కొండవీటి దొంగ, ఆదిత్య 369, అశ్వమేధం, మేజర్ చంద్రకాత్, నిప్పురవ్వ వంటి స్టార్ హీరో చిత్రాల్లో నటించారు. ఇక ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన సొంతం. ఇక హిందీలో లెక్కలేనన్ని చిత్రాలు చేశారు. ఈయన గురించి తెలుసు కానీ.. ఈ ఫ్యామిలీ ఏంటీ అనే వివరాలు చాలా మందికి తెలియదు. అమ్రీష్ పురి తర్వాత ఇండస్ట్రీలోకి ఎవరు వచ్చారు.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసుకుందాం. పంజాబ్‌లో పుట్టిన అమ్రిష్ పురి.. నలుగురు సంతానంలో ఒకరు. ఆయన కాస్తంత ఫిల్మీ గ్రౌండ్ ఉంది. ఆయన సోదరులు కూడా నటులే.
1956 నుండి 2005 ఆయన మరణించేంత వరకు సుమారు 450కి పైగా చిత్రాల్లో నటించి.. తిరుగులేని స్టార్ విలన్ అయ్యారు. హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, మరాఠీ భాషల్లో నటించారు. ఊర్మిళ దేవికర్ అనే మహిళను 1957లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. నమ్రత పురీ, రాజీవ్ పురీ. కాగా, ఆయన సినిమాలో నటించారు కానీ అంతగా ఆకట్టుకోలేదు. ఇక తాత వారసత్వాన్ని నిలబెట్టేందుకు ఎంట్రీ ఇచ్చాడు మనవుడు వర్దన్ పురి. 2019లో వచ్చిన ఏ సాలి ఆషికీ మూవీతో ఎంట్రీ ఇచ్చిన వర్దన్ పురి.. ఆషెక్, దశ్మీ వంటి చిత్రాల్లో నటించాడు. ఇటీవల అవికా గోర్ నటించిన ఓటీటీ మూవీ బ్లడీ ఇష్క్‌లో నటించాడు. నౌటంకీ అనే మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. తాతలా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతనిలా మంచి పేరు తెచ్చుకోవాలని మనమూ ఆశిద్దాం.