iDreamPost
android-app
ios-app

వీడియో: లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ నరేష్! అమ్మాయి ఎవరంటే?

  • Author Soma Sekhar Published - 04:45 PM, Mon - 27 November 23

జబర్దస్త్ నరేష్ తన ప్రియురాలిని అందరికి పరిచయం చేసి షాకిచ్చాడు. మేమిద్దరం రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఆ అమ్మాయి ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

జబర్దస్త్ నరేష్ తన ప్రియురాలిని అందరికి పరిచయం చేసి షాకిచ్చాడు. మేమిద్దరం రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఆ అమ్మాయి ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 04:45 PM, Mon - 27 November 23
వీడియో: లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ నరేష్! అమ్మాయి ఎవరంటే?

బుల్లితెరపై ఎంటర్ టైన్ మెంట్ కు కొదవలేదు. ఎన్నో కామెడీ షోలు, రియాలిటీ షోలు ప్రేక్షకులను అలరిస్తూ.. ముందుకు సాగుతున్నాయి. వాటిల్లో ఒకటి ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. ప్రతీవారం కొత్త కొత్త కాన్సెప్ట్ లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది ఈ షో. ఇక తాజాగా డిసెంబర్ 3వ తారీఖు ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఎపిసోడ్ కు ‘సౌండ్ పార్టీ’ మూవీ టీమ్ గెస్ట్ లుగా వచ్చి సందడి చేశారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ నరేష్ తన ప్రియురాలిని అందరికి పరిచయం చేసి షాకిచ్చాడు. మేమిద్దరం రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నాం అంటూ చెప్పుకొచ్చాడు నరేష్.

శ్రీదేవి డ్రామా కంపెనీ.. బుల్లితెరపై ఎన్ని కామెడీ షోలు ఉన్నాగానీ ఈ షోకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ వారం కొత్త కొత్త కాన్సెప్ట్ లే కాకుండా పండగల సమయంలోనూ స్పెషల్ ఈవెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటుంది. కాగా.. డిసెంబర్ 3వ తేదీకి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ కు బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ నటించిన ‘సౌండ్ పార్టీ’ మూవీ టీమ్ గెస్ట్ గా వచ్చి సందడి చేసింది. ఇదిలా ఉండగా.. జబర్దస్త్ నరేష్ తన ప్రియురాలిని శ్రీదేవీ డ్రామా కంపెనీ స్టేజ్ పైకి పిలిచి అందరికి పరిచయం చేశాడు.

ఇన్ని రోజులు సీక్రెట్ గా ఉంచానని, కానీ ఈరోజు చెప్పేస్తున్నా అంటూ.. తన లవర్ ను పరిచయం చేశాడు నరేష్. తామిద్దరం రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం అని తెలిపాడు నరేష్. ఇక వీరి పెళ్లికి నరేష్ తండ్రి కూడా అంగీకరించాడు. దీంతో వీరిద్దరు స్టేజ్ పైనే ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే అతడి ప్రియురాలికి సంబంధించిన ఇతర విషయాలు గానీ, ఆమె పేరును గానీ రివీల్ చేయలేదు. మరి వీరి ప్రేమ గురించి మరింతగా తెలుసుకోవాలంటే ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఇది పబ్లిసిటీ స్టంట్ అంటే.. మరికొందరు మాత్రం ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş