iDreamPost
android-app
ios-app

Jabardasth Avinash: ముక్కు అవినాష్ ఇంట తీవ్ర విషాదం.. భావోద్వేగంతో..

  • Published Jan 07, 2024 | 9:43 AM Updated Updated Jan 07, 2024 | 9:43 AM

ముక్కు అవినాష్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

ముక్కు అవినాష్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

  • Published Jan 07, 2024 | 9:43 AMUpdated Jan 07, 2024 | 9:43 AM
Jabardasth Avinash: ముక్కు అవినాష్ ఇంట తీవ్ర విషాదం.. భావోద్వేగంతో..

ముక్కు అవినాష్.. బుల్లితెర ప్రేక్షకులకు మాత్రమే కాకుండా వెండితెర ఆడియన్స్ కి కూడా సుపరిచితుడు. జబర్దస్త్ షోతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ కమెడియన్ తర్వాత బిగ్ బాస్ షోతో మరింత ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు పలు షోస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అడపాదడపా సినిమాల్లో కూడా సందడి చేశాడు. ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. తన లైఫ్ జరిగే ప్రతి విషయాన్ని అవినాష్ సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటాడు. అలాగే తన లైఫ్ లో ఇప్పుడు జరిగిన ఒక విషాద ఘటనను తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు.

ముక్కు అవినాష్ కు తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. తన కామెడీ టైమింగ్ తో అందరినీ అలరిస్తూ ఉంటాడు. అవినాష్ కు 2021 నవంబర్ లో అనూజాతో వివాహమైంది. ఆ తర్వాత వారి లైఫ్ లో ఎన్నో మెమొరబుల్ మూమెంట్స్ ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. వాటిలో వాళ్లు తల్లిదండ్రులు కాబోతున్నారు అనే వార్తను కూడా తమ అభిమానులతో పంచుకున్నారు. అయితే తాజాగా అవినాష్ వారి జీవితంలో జరిగిన అత్యంత బాధాకర విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశాడు. అవినాష్ దంపతులు బిడ్డను కోల్పోయినట్లు వెల్లడించాడు. ఈ విషయాన్ని చెబుతూ అవినాష్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన లైఫ్ లో మంచైనా చెడైనా అభిమానులతో షేర్ చేసుకునేవాడినని.. అలాగే ఈ విషయాన్ని కూడా బాధ్యతతో పంచుకుంటున్నట్లు తెలిపాడు.

mukku avunash

“నా లైఫ్ లో సంతోషమైనా, బాధ అయినా.. నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ మొదటిసారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందాం అని అనుకుంటున్నాను. మేము అమ్మా నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎదురు చూశాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డని కొల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది. అంత తొందరగా మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలీ అన్న బాధ్యతతో ఈ విషయాన్నీ మీతో పంచుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు మాపై చూపించిన ప్రేమకీ థ్యాంక్యూ.. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనూజ అవినాష్..” అంటూ ఈ విషాద ఘటన గురించి అవినాష్ ఎమోషనల్ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అనూజ- అవినాష్ దంపతులకు ధైర్యం చెబుతున్నారు. తమ సపోర్ట్ ఎప్పిటీకీ వీరికి ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. మరి.. అవినాష్ దంపతులకు కామెంట్స్ రూపంలో మీ సపోర్ట్ తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Mukku Avinash (@jabardasth_avinash)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom