iDreamPost
android-app
ios-app

పెళ్లైన ఏడాదికే విడిపోతున్న జబర్దస్త్‌ జంట.. ఇదేం పైత్యం అంటున్న ప్రేక్షకులు!

  • Published Jun 28, 2023 | 11:10 AM Updated Updated Jun 28, 2023 | 11:10 AM
  • Published Jun 28, 2023 | 11:10 AMUpdated Jun 28, 2023 | 11:10 AM
పెళ్లైన ఏడాదికే విడిపోతున్న జబర్దస్త్‌ జంట.. ఇదేం పైత్యం అంటున్న ప్రేక్షకులు!

ప్రపంచంలో భారతీయ వివాహ వ్యవస్థకు ఎంతో గొప్పస్థానం ఉందని చెబుతారు. మన వివాహ వ్యవస్థ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. అయితే ఎంత గొప్ప బంధమైనా సరే.. నమ్మకం, విశ్వాసం ఉన్నంతవరకే అది నిలబడుతుంది. బంధం బరువుగా మారితే.. విడిపోతారు. అలానే పెళ్లి బంధం కూడా. అయితే కొన్నాళ్ల క్రితం వరకు విడాకులు తీసుకోవాలంటే.. ఎన్నో ఆలోచించేవారు. పిల్లలు, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే.. బంధాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అన్ని నచ్చితేనే కలిసి ఉందాం లేదంటే.. విడాకులు తీసుకోవడం ఉత్తమం అనుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ఇక సినిమా ఇండస్ట్రీలో అయితే విడాకులు అనేవి చాలా సర్వ సాధారణ విషయంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా జబర్దస్త్‌ జంటకు సంబంధించిన విడాకులు వార్త నెట్టింట వైరలవుతోంది. ఈ వార్తలపై ప్రేక్షకులు మండి పడుతున్నారు. అసలేం జరిగింది అంటే..

బుల్లితెర మీద ప్రసారం అయ్యే కామెడీ షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కమెడియన్‌ యాదమ్మ రాజు. అలానే స్టెల్లాతో కలిసి యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ.. విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య లవ్‌ మొదలై.. గతేడాది పెద్దలను ఒప్పించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఇద్దరు పలు టీవీ షోలు చేస్తూ.. బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వీరద్దరికి సంబంధించి తాజాగా ఓ షాకింగ్‌ వార్త వెలుగులోకి వచ్చింది. అదేంటి అంటే.. పెళ్లై పట్టుమని ఏడాది కావడం లేదు.. అప్పుడే వీరిద్దరూ విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ప్రేక్షకులు మండి పడుతున్నారు. మీకు కొంచెం అయినా బుద్ధి ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకు ఏం జరిగింది అంటే…

బుల్లితెర కామెడీ షో అయిన జబర్దస్త్‌లో కమెడియన్లు.. ప్రతి వారం ఓ వెరైటీ థీమ్‌తో ప్రేక్షకుల ముందుకొస్తుంటారు. దీనిలో భాగంగా ఈ వారం యాదమ్మ రాజు, స్టెల్లా విడాకులు తీసుకోవడానికి రెడీ అయినట్లు ఓ స్కిట్‌ చేస్తున్నారు. విడాకుల థీమ్‌కు సంబంధించిన స్కిట్‌లో ఈ జంట కనిపించనున్నారు. తాజాగా విడుదలైన జమర్దస్త్‌ కామెడీ షో ప్రోమోలో వీరి విడాకులు అంశం తెర మీదకు వచ్చింది. ‘నీతో నావల్ల కావడం లేదు. నాకు విడాకులు కావాలి’ అని స్టెల్లా అడుగుతుంది. ఆ విడాకులు కూడా ఓ ఫంక్షన్‌లా జరగాలని చెబుతుంది. ఈ ప్రొమో చూసిన ప్రేక్షకులు మండి పడుతున్నారు. షో కోసం ఇన్నాళ్లు పెళ్లిల్లు చేశారు.. ఇప్పుడు విడాకులు కూడానా.. మీకు కొంచెం అయినా బుద్ధి లేదా.. పెళ్లై ఏడాది కూడా కాలేదు.. ఇంతలోనే విడాకులు అంటూ ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తారా.. టీఆర్పీ కోసం ఎంతకైనా దిగజారతారా అంటూ ఓ రేంజ్‌లో మండి పడుతున్నారు ప్రేక్షకులు.

జబర్దస్త్ కామెడీ షోలో కడుపుబ్బా నవ్వించే యాదమరాజు, అతని భార్య స్టెల్లా గతేడాది పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక స్టెల్లా కూడా భర్తపేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్‌ను ఓపెన్ చేసింది. పలు షోలు, ఈవెంట్స్ చేస్తూ బిజీగా ఉంది. రోటిన్‌ ప్రొగ్రామ్స్‌ చేసుకోకుండా.. వెరైటీ కోసం ప్రయత్నించి.. విమర్శలు ఎదుర్కొంటున్నారు ఈ జంట.

Jojobet GirişmeritbetmarsbahisHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet giriş