Kevvu Karthik: జబర్దస్త్ కెవ్వు కార్తీక్‌ ఇంట తీవ్ర విషాదం.. క్యాన్సర్‌తో పోరాడుతూ

జబర్దస్త్‌ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కెవ్వు కార్తీక్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ సందర్భంగా కార్తీక్‌ సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ చేశాడు. ఆ వివరాలు..

జబర్దస్త్‌ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కెవ్వు కార్తీక్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ సందర్భంగా కార్తీక్‌ సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ చేశాడు. ఆ వివరాలు..

బుల్లితెర మీద ప్రసారం అవుతున్న జబర్దస్త్‌, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ వంటి కార్యక్రమాల వల్ల ఎందరో కొత్త కళాకారులకు బుల్లితెర మీద కనిపించే అవకాశాలు దక్కుతున్నాయి. ఇక్కడ క్లిక్కయిన వారు అనేక మంది ఇప్పుడు సినిమాల్లో రాణిస్తున్నారు. వీరిలో కొందరు హీరోలుగా మారారు. ఇక బుల్లితెర మీద వచ్చిన గుర్తింపుతో.. సోషల్‌ మీడియాలో కూడా దూసుకుపోతున్నారు. దాదాపు జబర్దస్త్‌ ఆర్టిస్టులందరికి కూడా యూటబ్యూబ్‌ చానెల్‌ ఉండగా.. వీరికి ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్లు భారీగా ఉన్నారు. అటు బుల్లితెర, ఇటు సోషల్‌ మీడియాలో కూడా ఫుల్లు యాక్టీవ్‌గా ఉంటూ.. ఫాలోవర్లతో పాటు తమ క్రేజ్, ఆదాయం కూడా పెంచుకుంటున్నారు. ఇక చాలా మంది సొంత ఇంటి నిర్మాణం, ఇష్టమైన వాహనాలు కొనుగలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా జబర్దస్త్‌ నటుడు కార్తీక్ ఇంట విషాదం నెలకొంది. ఆ వివరాలు..

జబర్దస్త్‌ కార్యక్రమం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో కెవ్వు కార్తీక్‌ ఒకరు. ఈ ప్రోగ్రాం ద్వారా వచ్చిన గుర్తింపుతో అనేక స్టేజ్‌ షోలు, ఈవెంట్లలో తన ప్రతిభ ప్రదర్శిస్తూ.. ఆడియెన్స్‌కు దగ్గరయ్యాడు. ఈ క్రమంలో తాజాగా కార్తీక్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కార్తీక్‌ తల్లి కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పొరాడుతున్న కార్తీక్‌ తల్లి.. బుధవారం రాత్రి కన్నుమూశారు. ఈ సందర్భంగా కార్తీక్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. తన తల్లి జీవితం మొతం యుద్ధమే అని పేర్కొన్నాడు. ఇది చూసిన అభిమానులు, తోటి నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ధైర్యంగా ఉండమని కామెంట్స్‌ చేస్తున్నారు.

ఈ సందర్భంగా కార్తీక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తల్లిని గుర్తు చేసుకుంటూ.. ఎమోషనల్‌ పోస్ట్‌ చేశాడు. ‘‘అమ్మా గత 5 సంవత్సరాల 2 నెలలు గా క్యాన్సరే భయపడే విధంగా ఆ మహమ్మారిపై అలుపెరుగని పోరాటం చేశావ్. నీ జీవితం అంతా యుద్ధమే. మమ్మల్ని కన్నావు.. నాన్నకి తోడుగా ఉంటూ.. కష్టాల్లో కూడా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడావ్. అమ్మా ఈ 5 సంవత్సరాల నుండి ఒంటరిగా ఎలా పోరాడాలో నాకు నేర్పావు. నీ ఆత్మస్థైర్యం నాలో ధైర్యాన్ని నింపింది. అన్నీ నేర్పావు కానీ నువ్వు లేకుండా ఎలా బతకాలో మాత్రం నేర్పలేదు ఎందుకు అమ్మా.. మా అమ్మ కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. మా అమ్మకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ అందరికీ నా పాదాభివందనం’’ అంటూ కెవ్వు కార్తిక్ ఎమోషనల్ పోస్ట్‌ చేశాడు.

గురువారం ఉదయం నుంచి తన ఇంటి వద్దే పార్థివదేహాన్ని సందర్శనార్థం ఉంచుతున్నామని కార్తిక్ తెలిపాడు. మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లుగా చెప్పాడు. గత ఐదేళ్లుగా కార్తీక్‌ తల్లి క్యాన్సర్‌తో పోరాడుతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశాడు కార్తీక్‌. అప్పుడు చాలా మంది అతడికి ధైర్యం చెప్పారు. మీ అమ్మ కోలుకుంటుంది.. ధైర్యం కోల్పోకు అని కామెంట్స్‌ చేశారు.

Show comments