iDreamPost
android-app
ios-app

జబర్దస్త్ యోధ.. అప్పుడే ఇంత పెద్దదయ్యిందా..? ఇప్పుడేం చేస్తుందంటే..?

  • Published Aug 19, 2024 | 4:11 PM Updated Updated Aug 19, 2024 | 4:11 PM

గడసరి అత్త- సొగసరి కోడలు సిరీస్ తో ఆకట్టుకున్న చైల్ట్ యాక్టర్స్ రమ్యశ్రీ, యోధ. ఆ తర్వా పటాస్ షోలో యోధ సిస్టర్స్ గా నవ్వుల పువ్వులు పూయించారు. ఆ తర్వాత జబర్దస్త్ షోలో దీవెనతో కలిసి స్కిట్స్ చేసింది యోధ. అనూహ్యంగా ఈ షో నుండి తప్పుకున్న యోధ.. ఇప్పుడు ఎలా మారిపోయిందంటే..?

గడసరి అత్త- సొగసరి కోడలు సిరీస్ తో ఆకట్టుకున్న చైల్ట్ యాక్టర్స్ రమ్యశ్రీ, యోధ. ఆ తర్వా పటాస్ షోలో యోధ సిస్టర్స్ గా నవ్వుల పువ్వులు పూయించారు. ఆ తర్వాత జబర్దస్త్ షోలో దీవెనతో కలిసి స్కిట్స్ చేసింది యోధ. అనూహ్యంగా ఈ షో నుండి తప్పుకున్న యోధ.. ఇప్పుడు ఎలా మారిపోయిందంటే..?

  • Published Aug 19, 2024 | 4:11 PMUpdated Aug 19, 2024 | 4:11 PM
జబర్దస్త్ యోధ.. అప్పుడే  ఇంత పెద్దదయ్యిందా..? ఇప్పుడేం చేస్తుందంటే..?

బుల్లితెరపై కామెడీతో నవ్వులు పువ్వులు పూయించాయి జబర్దస్త్, పటాస్‌ షోలు. ఇప్పుడు పటాస్‌కు బ్రేక్ పడింది. జబర్దస్త్ టైమింగ్ మార్చుకుని ఇంకా కొనసాగుతుంది. ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంటర్స్ తమ ప్రతిభను కనబర్చి.. ఇప్పుడు బుల్లితెర లేదా వెండితెరపై దూసుకెళుతున్నారు. కానీ మరికొంత మంది షో నుండి తప్పుకుని, సోషల్ మీడియా ద్వారా దగ్గరవుతున్నారు. వారిలో ఒకరు యోధ. చైల్డ్ ఆర్టిస్టు నుండి బుల్లితెరపై కనువిందు చేసింది. అత్తా కోడళ్లుగా రమ్య శ్రీ, యోధ చేసిన వీడియోలో అప్పట్లో ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఎక్కడ చూసినా వీరి వీడియోలో కనిపించాయి. అలా ఈ ఇద్దరు స్మాల్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చారు. యోధ సిస్టర్స్‌గా పటాస్ ప్రోగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. యోధా సిస్టర్స్ పేరుతో ఎన్నో స్కిట్స్ చేసి అనతికాలంలో ప్రేక్షకులను హృదయాలను కొల్లగొట్టారు.

యోధ తన ముద్దు ముద్దు మాటలతో, చేష్టలతో పిల్ల కాదురా ఇది పిడుగు అనిపించేలా చేసింది. దేశ ముదుర్లు అనే కామెడీ షో కూడా చేశారు. వీరి గ్యాంగ్‌లోకి దీవెన వచ్చి చేరింది. చదువుల నిమిత్తం రమ్యశ్రీ పూర్తిగా నటన నుండి తప్పుకుంది. ఇక యోధ, దీవెనలు కంటిన్యూ అయ్యారు. అలా ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో కనిపించారు. అవినాష్, కార్తీక్ టీంలో చేసిన తర్వాత రాకింగ్ రాకేష్ టీంలోకి షిఫ్ట్ అయ్యారు. అలా ఆ షో పెద్దల స్కిట్ నుండి పిల్లల స్కిట్స్ గా మారిపోయింది. ఈ ఇద్దరే షోకు స్పెషల్ ఎట్రాక్ట్ అయ్యేవారంటే అతిశయోక్తి కాదు. ఇక తోటి కంటెస్టెంట్లతో పాటు పోటా పోటీగా నటించేది. అలా మూవీ ఆఫర్స్ కూడా కొల్లగొట్టింది. పలు చిత్రాల్లో నటించింది. అయితే అనూహ్యంగా జబర్దస్త్ నుండి తప్పుకుంది యోధ. చదువుల నిమిత్తం ప్రస్తుతం మేకప్‪కు దూరంగా ఉంటుంది.

Jabardasth Yodha recent 01

ప్రస్తుతం యోధ కుటుంబం సొంతూరు ఖమ్మం జిల్లాకు షిఫ్ట్ అయిపోయింది . అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ స్వింగ్‌లో ఉంది. తండ్రి చందుతో కలిసి యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేసిన యోధ.. రీల్స్, వీడియోలు చేస్తుంది. చూస్తుండగానే టీనేజ్ వయస్సుకు వచ్చేసింది యోధ. ఇప్పుడు బుట్టబొమ్మగా ఆకట్టుకుంటుంది. చక్కనైనా చిరునవ్వుతో.. లంగావోణీ, పంజాబీ డ్రెస్సులో అచ్చమైన తెలుగు అమ్మాయిగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తన సహ నటి దీవెనతో కలిసి అప్పుడప్పుడు సందడి చేస్తోంది. అక్కడ కూడా పలు ఈవెంట్లలో కూడా పాల్గొంటోంది. ప్రస్తుతం యోధ పదో తరగతి చదువుతుంది. అంటే వచ్చే ఏడాది కాలేజీలోకి అడుగుపెట్టబోతుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom