iDreamPost
android-app
ios-app

ఆసుపత్రిలో చేరిన జబర్ధస్త్ ఫైమా.. ఇంతకీ ఏమైంది?

  • Published Nov 25, 2023 | 4:01 PM Updated Updated Nov 25, 2023 | 4:01 PM

తన కామెడీతో ఆధ్యాంతం నవ్వులు పుట్టించే జబర్ధస్త్ ఫైమా ఆసుపత్రిపాలైంది. దీనికి సంబంధించిన విషయాన్ని తన వ్యక్తిగత ఇన్ స్టా ఖాతాలో నెటిజన్స్ తో పంచుకుంది. ఆ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.

తన కామెడీతో ఆధ్యాంతం నవ్వులు పుట్టించే జబర్ధస్త్ ఫైమా ఆసుపత్రిపాలైంది. దీనికి సంబంధించిన విషయాన్ని తన వ్యక్తిగత ఇన్ స్టా ఖాతాలో నెటిజన్స్ తో పంచుకుంది. ఆ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.

  • Published Nov 25, 2023 | 4:01 PMUpdated Nov 25, 2023 | 4:01 PM
ఆసుపత్రిలో చేరిన జబర్ధస్త్ ఫైమా.. ఇంతకీ ఏమైంది?

పటాస్ షో కి ఆడియెన్ గా వచ్చి అదే ప్రోగ్రాంకి కంటెస్టెంట్ అయ్యింది ఫైమా. తన హిలేరియస్ పంచులతో కడుపుబ్బ నవ్వించడం ఫైమకు వెన్నతో పెట్టిన విద్య. అక్కడ మొదలైన ప్రయాణం అంచెలంచెలుగా ఎదిగి తెలుగులో వన్ ఆఫ్ ది టాప్ కామెడీ షో జబర్ధస్త్ లో ఛాన్స్ కొట్టేసింది. జబర్ధస్త్ వేదికపై తన కామెడీతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఫైమా తనకంటూ ఓ గుర్తింపును సాధించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఫైమా ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో ఉన్న ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో దానికి సంబంధించిన పోస్టు పెట్టింది. ఇది నెట్టింటా వైరల్ గా మారింది. ఇది చూసిన ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

జబర్ధస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే పాపులారిటీ పొందింది ఫైమా. సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఏ సపోర్ట్ లేకున్నా కూడా తన సత్తా ఏంటో నిరూపించుకుంది. పర్ ఫెక్ట్ టైమింగ్ తో పంచులు విసురుతూ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ను అందించేది. దీంతో ఆమెకు ఎనలేని క్రేజ్ ఏర్పడింది. అయితే జబర్ధస్త్ ఫైమా ఆసుపత్రిపాలైంది. ఏమైందో ఏమో తెలియదు గానీ హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. దీంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు ఫైమకు ఏమైందో అని కంగారు పడుతున్నారు. నా గతమంతా నే మరిచానే అనే పాటను జోడిస్తూ తన చికిత్సకు సంబంధించిన దృష్యాలను ఇన్ స్టా వేదికగా నెటిజన్స్ తో పంచుకుంది. ఇది చూసిన వారు.. మీకు ఏమైందో చెప్పండని, మరికొందరు మీరు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫైమ అనారోగ్యానికి గల కారణాలేంటనేది ఇంకా తెలియరాలేదు.

 

View this post on Instagram

 

A post shared by FAIMA (@faima_patas)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetewin girişgrandpashabet