iDreamPost
android-app
ios-app

తండ్రి కాబోతున్న జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్! పోస్ట్ వైరల్..

  • Author Soma Sekhar Published - 11:46 AM, Mon - 10 July 23
  • Author Soma Sekhar Published - 11:46 AM, Mon - 10 July 23
తండ్రి కాబోతున్న జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్! పోస్ట్ వైరల్..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలు ఏ చిన్న విషయాన్ని అయినా వెంటనే అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ ఓ గుడ్ న్యూస్ ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. బిగ్ బాస్ షో ద్వారా తనదైన కామెడీని పంచి నవ్వులు పూయించాడు. ప్రస్తుతం పలు రియాలిటీ షోలు చేస్తూ.. బిజీబిజీగా ఉన్నాడు. ప్రస్తుతం తన భార్య ప్రెగ్నెంట్ అని, త్వరలోనే తాము తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్నామని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పంచుకున్నాడు.

ముక్కు అవినాష్.. జబర్దస్త్ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బా నవ్వించాడు. ఆ తర్వాత బిగ్ బాస్ షోలో పాల్గొని తనదైన కామెడీని పంచాడు. ఇక అవినాష్ క్రేజ్ ను బిగ్ బాస్ షో మరో రేంజ్ కు తీసుకెళ్లిందనే చెప్పాలి. బిగ్ బాస్ కు హౌస్ లోకి వెళ్లడంతో.. జబర్దస్త్ మానేసిన అవినాష్.. ప్రస్తుతం స్టార్ మా, ఆహాలో షోస్ చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. తాను తండ్రి కాబోతున్నాను అంటూ తన యూట్యూబ్ ఛానల్ తో పాటుగా ఇన్ స్టా ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం తన భార్య అనూజకు నాలుగో నెల అని.. త్వరలోనే మేం తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్నాం అంటూ సంతోషం వ్యక్తం చేశాడు ముక్కు అవినాష్.

అయితే గతంలో నేను యూట్యూబ్ లో వీడియోలు పెట్టినప్పుడు.. వాటిని చూసి తన భార్య ప్రెగ్నెంట్ అని రూమర్స్ క్రియేట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ రూమర్స్ పై గతంలోనే స్పందించిన అవినాష్.. అలాంటి గుడ్ న్యూస్ ఉంటే మీకు కచ్చితంగా చెప్తాం అంటూ సమాధానం ఇచ్చాడు. అన్నట్లుగానే ఇప్పుడు గుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకున్నాడు. మా జీవితంలోకి మరో చిన్నారి రాబోతున్నారు. చాలా హ్యాపీగా ఉంది.. ఈ విషయం మీతో పంచుకోవడం సంతోషంగా ఉందంటూ ఈ వీడియోలు చెప్పుకొచ్చాడు ముక్కు అవినాష్. దాంతో పలువురు సెలబ్రిటీలు అవినాష్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş