iDreamPost

Avinash: ఆడిషన్ కు వెళ్తే.. నా ఫొటో తీసుకుని చెత్త బుట్టలో వేశారు: జబర్దస్త్ అవినాష్

తాజాగా ఓ షోలో పాల్గొన్న జబర్దస్త్ అవినాష్ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న అవమానాలను చెప్పుకొచ్చాడు. ఓ ఆడిషన్ కు వెళ్తే.. అక్కడ నా ఫొటోను తీసుకుని చెత్త బుట్టలో వేశారు అంటూ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

తాజాగా ఓ షోలో పాల్గొన్న జబర్దస్త్ అవినాష్ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న అవమానాలను చెప్పుకొచ్చాడు. ఓ ఆడిషన్ కు వెళ్తే.. అక్కడ నా ఫొటోను తీసుకుని చెత్త బుట్టలో వేశారు అంటూ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

Avinash: ఆడిషన్ కు వెళ్తే.. నా ఫొటో తీసుకుని చెత్త బుట్టలో వేశారు: జబర్దస్త్ అవినాష్

సినిమా అనే రంగుల ప్రపంచంలోకి రావాలని, అక్కడ గొప్పగా రాణించి.. పేరు తెచ్చుకోవాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అయితే అదంత ఈజీ కాదని అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కుకోవడం, ఛాన్స్ లు దక్కించుకోవడం ఆశామాషీ విషయం కాదు. ఇక కెరీర్ ప్రారంభంలో అయితే చెప్పులు అరిగేలా మూవీ ఆఫీస్ ల చుట్టూ తిరగాల్సిందే. చాలా మంది నటీ, నటులు ఓ స్టేజ్ కి వచ్చాక.. పరిశ్రమకు వచ్చిన కొత్తలో తాము పడ్డ కష్టాల గురించి, ఎవ్వరికీ తెలియని షాకింగ్ నిజాలను వెల్లడిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తన జీవితంలో ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న కష్టాలు, అవమానాల గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు జబర్దస్త్ అవినాష్.

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులుకు దగ్గరైయ్యాడు అవినాష్. ఇక అభిమానులు ముక్కు అవినాష్ అని ముద్దుగా పిలుచుకుంటారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లొచ్చిన తర్వాత అతడి క్రేజ్ ఇంకాస్త పెరిగింది. ప్రస్తుతం స్టార్ మాలో ప్రొగ్రామ్స్ చేస్తూ.. ప్రేక్షకులను తనదైన కామెడీతో అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ పీపుల్స్ మీడియా నిర్వహిస్తున్న ‘దావత్’ ప్రొగ్రామ్ కు గెస్ట్ గా వచ్చాడు అవినాష్. ఈ షోకు రీతూ చౌదరీ యాంకరింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో తన కెరీర్ కు సంబంధించిన విశేషాలతో పాటుగా అవకాశాల కోసం తిరిగే క్రమంలో తాను ఎదుర్కొన్న అవమానాలను పంచుకున్నాడు.

అవినాష్ మాట్లాడుతూ..”లైఫ్ లో ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతోనే జబర్దస్త్ మానేశాను. ఇక్కడి నుంచి మరో స్థాయికి వెళ్తాను తప్పితే కిందికి దిగాలి అనుకోట్లేదు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు నేను రూ. 10 లక్షలు కట్టి షో నుంచి బయటకి వచ్చాను. ఇక నా కెరీర్ విషయానికి వస్తే.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల తిరిగేవాడిని. ఆ సమయంలో ఓ మూవీ ఆఫీస్ కు ఆడిషన్ కి వెళ్లాను. అక్కడ నా ఫొటో అడిగారు, నేను ఇచ్చాను. మళ్లీ ఫోన్ చేస్తామన్నారు. కానీ నేను అటు తిరగ్గానే నా ఫొటోను చెత్త బుట్టలో పడేశారు. కానీ ఇప్పుడు వారే నాకు ఫోన్ చేసి, నా డేట్స్ అడిగారు” అంటూ తన కష్టాలతో పాటుగా సక్సెస్ గురించి చెప్పుకొచ్చాడు ముక్కు అవినాష్. కాగా.. ప్రస్తుతం పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ లో బిజీ ఆర్టిస్ట్ గా ముందుకుసాగుతున్నాడు ఈ జబర్దస్త్ యాక్టర్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి