iDreamPost
android-app
ios-app

హీరోయిన్ గా జబర్దస్త్ ఐశ్వర్య మూవీ.. ట్రైలర్ తోనే అంచనాలు పెంచేస్తూ..

  • Published Apr 10, 2024 | 9:18 PM Updated Updated Apr 11, 2024 | 12:08 PM

Jabardasth Aishwary- Mercy killing Movie: జబర్దస్త్ ఐశ్వర్య హీరోయిన్ గా కొత్త సినిమా రాబోతోంది. పార్వతీశం హీరోయిన్ గా, ఐశ్వర్య హీరోయిన్ గా మెర్సీ కిల్లింగ్ అనే సినిమా విడుదల కాబోతోంది.

Jabardasth Aishwary- Mercy killing Movie: జబర్దస్త్ ఐశ్వర్య హీరోయిన్ గా కొత్త సినిమా రాబోతోంది. పార్వతీశం హీరోయిన్ గా, ఐశ్వర్య హీరోయిన్ గా మెర్సీ కిల్లింగ్ అనే సినిమా విడుదల కాబోతోంది.

  • Published Apr 10, 2024 | 9:18 PMUpdated Apr 11, 2024 | 12:08 PM
హీరోయిన్ గా జబర్దస్త్ ఐశ్వర్య మూవీ.. ట్రైలర్ తోనే అంచనాలు పెంచేస్తూ..

జబర్దస్త్ ఐశ్వర్య.. బుల్లితెర ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జబర్దస్త్ షో ద్వారా ఐశ్వర్య రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయ్యింది. ఈ అమ్మడుకి బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే కొన్నాళ్ల నుంచి షోకి కాస్త దూరంగా ఉన్నట్లు కనిపిస్తూ వచ్చింది. అయితే చాలా మందికి ఎందుకు అనే విషయం తెలియదు. కానీ, అసలు విషయం ఏంటంటే.. హీరోయిన్ గా జబర్దస్త్ ఐశ్వర్య ఎంట్రీ ఇస్తోంది. అందుకే జబర్దస్త్ షోకి కాస్త గ్యాప్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. పైగా ఆమె నటించిన చిత్రం ఏప్రిల్ 12న థియేటర్లలో విడుదల కూడా కాబోతోంది.

జబర్దస్త్ ఐశ్వర్య క్యూట్ స్మైల్, అమాయకంగా ఆమె నవ్వే నవ్వుకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ అమ్మడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఆమె నటించి మూవీ ట్రైలర్ చూడగానే అంతా ఆశ్చర్యపోతున్నారు. ఐశ్వర్య హీరోయిన్ అయిపోయిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పార్వతీశం హీరోగా ఐశ్వర్య హీరోయిన్ గా మెర్సీ కిల్లింగ్ అనే సినిమా ఏప్రిల్ 12న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ మూవీకి వెంకట రమణ సూరపల్లి దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో స్టార్ కాస్టింగ్ గురించి కూడా చెప్పుకోవాలి. ఇందులో సాయి కుమార్ కీలక పాత్ర పోషించారు. అలాగే సూర్య భగవాన్ దాస్, ఆనంద్ చక్రపాణి, రామరాజు కీ రోల్స్ ప్లే చేశారు. ఈ మూవీ కథను మంచి ఆసక్తికర పాయింట్ తో తెరకెక్కించారు. ఆర్టికల్ 21ని ఆధారంగా చేసుకుని ఈ మూవీని నిర్మించినట్లు చెప్పారు.

 

View this post on Instagram

 

A post shared by Ishwarya Vullingala🇮🇳 (@actress_ishwarya_vullingala)

ఈ మూవీ ట్రైలర్ ఆసక్తిగా సాగింది. సమాజంలో అనాథలకు ఇచ్చే గౌరవం, మర్యాద, గుర్తింపు ఏంటి? అనే పాయింట్ ని హైలెట్ చేశారు. అనాథ అనగానే దొంగ అనే ముద్ర వేయకండి అంటూ వచ్చే డైలాగ్ హత్తుకుంటుంది. మెర్సీ కిల్లింగ్ కావాలి అంటూ డిమాండ్ చేసే పాత్రలో హీరోయిన్ ఐశ్వర్యను చూపించారు. అలాగే ఆమె పాత్ర చుట్టూ పార్వతీశంతో ఒక మంచి లవ్ స్టోరీని క్రియేట్ చేశారు. నెగిటివ్ షేడ్స్ లో సాయికుమార్ ని చూపించారు. జబర్దస్త్ గడ్డవం నవీన్, షేకింగ్ శేషులకు కూడా మంచి క్యారెక్టర్ దొరికింది. మొత్తానికి ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందని మేకర్స్ ఆకాంక్షిస్తున్నారు. హీరోయన్ గా ఐశ్వర్యకు మంచి హిట్ దొరకాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి.. హీరోయిన్ గా ఐశ్వర్య ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss