iDreamPost
android-app
ios-app

ప్రియుడికి ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగి లవ్ మ్యారేజ్ కన్ఫామ్ చేసిన జబర్దస్త్ నటి

  • Published Nov 09, 2023 | 4:17 PM Updated Updated Nov 09, 2023 | 4:17 PM

జబర్దస్త్ నటీనటుల్లో కొంతమంది ఇప్పటికే పెళ్లిల్లు చేసుకోగా మరో నటి పెళ్లికి సిద్ధమవుతోంది. తను ప్రేమించిన వ్యక్తితో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపింది. తాజాగా ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

జబర్దస్త్ నటీనటుల్లో కొంతమంది ఇప్పటికే పెళ్లిల్లు చేసుకోగా మరో నటి పెళ్లికి సిద్ధమవుతోంది. తను ప్రేమించిన వ్యక్తితో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపింది. తాజాగా ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  • Published Nov 09, 2023 | 4:17 PMUpdated Nov 09, 2023 | 4:17 PM
ప్రియుడికి ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగి లవ్ మ్యారేజ్ కన్ఫామ్ చేసిన జబర్దస్త్ నటి

ప్రతిభ ఉన్నవారికి ఓ వరంలా మారింది జబర్దస్త్ వేదిక. జనాల్లో విశేషమైన ఆధరణ కలిగిన జబర్దస్త్ కామిడీ షో ద్వారా ఎంతో మంది కమిడియన్లుగా రాణిస్తున్నారు. ఈ షో ద్వారా తమ టాలెంట్ ను నిరూపించుకుని వెండితెరపై కూడా ఆఫర్స్ దక్కించుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీలో వారికంటూ ఓ ప్రత్యేకత ఉండేలా వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అయితే జబర్దస్త్ షో కెరీర్ ను ఇవ్వడమే కాదు నటుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. జబర్దస్త్ ద్వారా నటులుగా సెటిల్ అవడంతో వైవాహిక జీవితాలకు స్వాగతం పలుకుతున్నారు పలువురు నటీనటులు. ఇప్పటికే యాదమ్మ రాజు లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. నూకరాజు ఆసియాతో ప్రేమలో ఉన్నట్లు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మరో జబర్దస్త్ నటి లవ్ మ్యారేజ్ కి సిద్ధమైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు పెద్దలు. ఈ క్రమంలోనే కొంత కాలం నుంచి లవ్ లో ఉన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. అయితే తాజాగా బుల్లి తెర నటి తన బ్యాచ్ లర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేసింది. త్వరలో తను కోరుకున్న ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలిపింది. ఆమె మరెవరో కాదు జబర్దస్త్ నటి పవిత్ర. తాజాగా తనకు కాబోయే వాడిని పరిచయం చేస్తూ తన వ్యక్తిగత ఇన్ స్టాగ్రాం ఖాతాలో పోస్టు చేసింది. జబర్దస్త్ వేదికపై పలు స్కిట్ లల్లో అలరించి నవ్వులు పూయించింది పవిత్ర. ఈ క్రమంలోనే ఫేమస్ అయిపోయింది. ఇక తన ఫ్యాన్స్, ఆడియెన్స్ తో మరింత దగ్గరయ్యేందుకు యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలు చేస్తూ టచ్ లో ఉంటుంది.

జబర్దస్త్ నటి పవిత్ర సంతోష్ అనే యువకుడితో కొంత కాలం నుంచి ప్రేమలో ఉంది. ఇప్పుడు తాజాగా సంతోష్ తో పెళ్లికి ఓకే చెప్పినట్లు కన్ఫామ్ చేసింది పవిత్ర. తనకు కాబోయే వాడికి ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగింది. దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. దీంతో ఆ ఫొటోలు వైరల్ గా మారాయి. త్వరలోనే తన ప్రేమికుడైన సంతోష్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు తన పెళ్లి వార్తను వెల్లడించింది. సంతోష్ కోసం సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాను. నా జీవితంలో ఇది చాలా ప్రత్యేకమైంది. నేను సంతోష్ ను అంగీకరించాను అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ నటి పవిత్రకు అభినందనలు తెలియజేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Jabardasth_pavithraa (@jabardasth_pavithraa)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio