Dharani
Varalaxmi Sarathkumar: ఇన్నాళ్లు పెళ్లి చేసుకోను.. సింగిల్‌గానే ఉంటాను అని చెప్పుకొచ్చిన వరలక్ష్మీ శరత్ కుమార్ సడెన్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాకిచ్చింది. ఇక ఆమె కాబోయే భర్త గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు..
Varalaxmi Sarathkumar: ఇన్నాళ్లు పెళ్లి చేసుకోను.. సింగిల్‌గానే ఉంటాను అని చెప్పుకొచ్చిన వరలక్ష్మీ శరత్ కుమార్ సడెన్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాకిచ్చింది. ఇక ఆమె కాబోయే భర్త గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు..
Dharani
వారసత్వంగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. తమిళ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కానీ అతి త్వరలోనే తనకు ఎలాంటి పాత్రలు సెట్ అవుతాయో తెలుసుకుని.. వాటికే సై అంది. వరలక్ష్మీ తీసుకున్న నిర్ణయం.. ఆమె కెరీర్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది. హీరోయిన్లకు మించి.. వరుస సినిమాలు.. బలమైన పాత్రలు చేస్తూ.. సౌత్‌లో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక తాజాగా వచ్చిన హనుమాన్ సినిమాలో కూడా కీలక పాత్ర పోషించింది. పాత్ర నచ్చాలే కానీ విలన్, సపోర్టింగ్ యాక్టర్ ఇలా వేటి గురించి ఆలోచించదు. అదే ఆమె కెరీర్‌కు ప్లస్సయింది. ఇప్పుడున్న ఇండస్ట్రీలో కుర్ర లేడీ విలన్‌గా, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మీ శరత్ కుమార్.
ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. వరలక్ష్మీ శరత్ కుమార్ చాలా ముక్కుసూటిగా మాట్లాడేస్తుంది. వివాదాలు, గాసిప్స్‌కు చాలా దూరం. ఇన్నాళ్ల పాటు పెళ్లి ఆలోచన కూడా చేయలేదు. కాకపోతే.. అప్పట్లో వరలక్ష్మీ శరత్ కుమార్ లవ్ స్టోరీ, పెళ్లి గురించి ఎన్నో రూమర్స్ వచ్చాయి. హీరో విశాల్‌తో ప్రేమలో ఉందని.. కానీ శరత్ కుమార్ వీరి లవ్‌ను అంగీకరించలేదని.. దాంతో వీరి పెళ్లి ఆగిపోయిందంటూ జోరుగా ప్రచారం సాగింది. కానీ వరలక్ష్మీ మాత్రం వాటిని ఖండించింది. తాను. విశాల్ మంచి స్నేహితులమని.. స్పష్టం చేసింది.
అంతేకాక గతంలో అనేక సార్లు.. తాను సింగిల్‌గానే ఉంటానని.. పెళ్లి చేసుకుంటే ఉపయోగం ఏం లేదని ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. పెళ్లి వద్దన్న వరలక్ష్మి తాజాగా తన నిశ్చితార్థం ఫొటో షేర్ చేసి అందరికి షాకిచ్చింది. నికోలయ్ సచ్ దేవ్ అనే ఆర్ట్ గ్యాలరీ యజమానితో వరలక్ష్మీ నిశ్చితార్థం జరిగింది. అతికొద్ది మంది సన్నిహిత బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.
ఇక వరలక్ష్మీ కాబోయే భర్త కావడంతో.. నికోలయ్ కూడా ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయాడు. దాంతో ఎవరతను.. అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. అని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో నికోలయ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. అది ఏంటంటే.. ఇతగాడికి అంతకుముందే పెళ్లి అయ్యినట్లు అభిమానుల పరిశోధనలో వెల్లడైందట. అతడి మొదటి భార్య పేరు కవిత సచ్ దేవ్ అని.. ఆమె ఒక మోడల్ అని తెలుస్తోంది. ఫ్యాషన్ రంగంలో ఆమె కొనసాగుతోంది.
అయితే వీరిద్దరికి అభిప్రాయ బేధాలు రావడంతో విడాకులు తీసుకున్నారని సమాచారం. వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు.. ఏంటీ.. వరలక్ష్మీ కాబోయే భర్తకు ముందే పెళ్లయ్యిందా .. అంటూ ఆశ్చర్యపోతుర్నారు. ఇంకొంతమంది ఇప్పుడు ఇదే ఫ్యాషన్ గా మారింది. ఏదైనా వీళ్లయినా హ్యాపీగా ఉంటే చాలు అని కామెంట్ చేస్తున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే.. వరలక్ష్మీ లేదా ఆమె కాబోయే భర్త ఈ వార్తలపై స్పందించాలి.