iDreamPost
android-app
ios-app

డైరెక్టర్.. సాహోకి, OGకి నిజంగా లింక్ వేశాడా..?

  • Author ajaykrishna Published - 09:52 AM, Fri - 21 July 23
  • Author ajaykrishna Published - 09:52 AM, Fri - 21 July 23
డైరెక్టర్.. సాహోకి, OGకి నిజంగా లింక్ వేశాడా..?

రన్ రాజా రన్, సాహో సినిమాలతో స్టైలిష్ మేకర్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ డైరెక్టర్ సుజిత్. 2019లో విడుదలైన సాహో తర్వాత సుజిత్ నుండి మరో సినిమా రాలేదు. దాదాపు నాలుగేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ తో OG సినిమా అనౌన్స్ చేశాడు. మాఫియా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. అన్ని రీమేక్ సినిమాలు చేసుకుంటూ పోతున్న పవన్.. ఒరిజినల్ కంటెంట్ OG ఓకే చేసేసరికి ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టి.. మేజర్ యాక్షన్ సీన్స్ అన్ని కంప్లీట్ చేశారు. కాగా.. ఈ సినిమాని ట్రిపుల్ ఆర్ ఫేమ్ డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

ఇక పవన్ ఫ్యాన్ బాయ్ గా సుజిత్ అందరికి తెలుసు. తాను తమ హీరోని తెరపై ఎంత స్టైలిష్ గా ప్రెజెంట్ చేయనున్నాడో ఫ్యాన్స్ సాహోలో ప్రభాస్ లుక్స్ చూసి అంచనా వేస్తున్నారు. పవన్ మరో ముప్పై రోజులు డేట్స్ కేటాయిస్తే.. పవన్ పోర్షన్స్ అన్ని షూట్ చేసుకునే ప్లాన్ లో ఉన్నాడట సుజిత్. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ, విలన్ రోల్ చేస్తున్నాడు. శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పవన్ సరసన గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇలాంటి తరుణంలో ఓజి గురించి ఓ ఇంటరెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది.

డైరెక్టర్ సుజిత్.. ఓజి కంటే ముందు ప్రభాస్ తో సాహో తీసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో వాజీ అనే సిటీని చూపించడం జరిగింది. సినిమా అంతా దాని చుట్టూ తిరుగుతుంది. మాఫియాకి హెడ్ క్వార్టర్ గా వాజీని తెరపై చూపించాడు సుజిత్. అయితే.. తాజాగా ఓజి మూవీకి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిలో ‘వాజీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్ పోర్ట్’ అని కంపెనీ పేరు కనిపించింది. దీంతో ఓజి సినిమాని సాహో కనెక్ట్ చేస్తున్నారా? అంటూ ఫ్యాన్స్ లో సందేహాలు మొదలైపోయాయి. దీని గురించి సోషల్ మీడియాలోను ప్రచారం ఊపందుకుంది. అసలు డైరెక్టర్ సుజిత్ ప్లాన్ ఏంటి? నిజంగా లింక్ చేస్తున్నాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ.. అసలు నిజం ఏంటనేది మూవీ రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. సో.. సాహో, ఓజి లలో కనిపించిన వాజీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom