iDreamPost
android-app
ios-app

కుబేర కథ, బిచ్చగాడు కథ ఒకటేనా?

ధనుష్ వాళకం చూసి ఇదేదో బిచ్చగాడు సినిమా ఇన్సిపిరేషన్ తో రెడీ అవుతోందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. బిచ్చగాడు సినిమా రికార్డు బ్రేక్ హిట్ అయింది కాబట్టి ఎక్కువమంది దానిపైనే ఫోకస్ పెట్టారు.

ధనుష్ వాళకం చూసి ఇదేదో బిచ్చగాడు సినిమా ఇన్సిపిరేషన్ తో రెడీ అవుతోందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. బిచ్చగాడు సినిమా రికార్డు బ్రేక్ హిట్ అయింది కాబట్టి ఎక్కువమంది దానిపైనే ఫోకస్ పెట్టారు.

కుబేర కథ, బిచ్చగాడు కథ ఒకటేనా?

పోస్టర్ చూసి ఆడియన్స్ కథ చెప్పేస్తారు అని ద గ్రేట్ డైరెక్టర్ కోడి రామక్రిష్ణ చెబుతూ ఉండేవారు. అలా ఇప్పుడు ఫస్ట్ లుక్ తోనే కథ ఎలా ఉంటుందో అంచనాలు కట్టి, ఊహించి, సోషల్ మీడియాలో పోస్టులు కూడా వెంటవెంటనే పెట్టేసే జనరేషన్ తయారైన నేపథ్యంలో ఫోర్ కేస్ట్ కి ఏ సినిమా అతీతం కాదన్నటు అయింది. ఈ మధ్యే శివరాత్రి సందర్భంగా ధనుష్ అండ్ కింగ్ నాగార్జున కాంబినేషన్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పుస్కూర్ రామ్మోహనరావు, సునీల్ నారంగ్ నిర్మిస్తున్న కుబేర ఫస్ట్ లుక్ రిలీజైంది.

అందులో ధనుష్ ఒక్కడినే దర్శకుడు శేఖర్ కట్ చేశాడు. నాగార్జునని ఒక్క ఫ్రేమ్ లో కూడా చూపించలేదు. అది కొంచెం అక్కినేని ఫేన్స్ ని కించపరిచింది. నాగార్జునలాటి పెద్ద హీరో సినిమాలో ఉంటే ఆయన్ని చూపించకపోవడమేమిటని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే…..ధనుష్ వాళకం చూసి ఇదేదో బిచ్చగాడు సినిమా ఇన్సిపిరేషన్ తో రెడీ అవుతోందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. బిచ్చగాడు సినిమా రికార్డు బ్రేక్ హిట్ అయింది కాబట్టి ఎక్కువమంది దానిపైనే ఫోకస్ పెట్టారు.

Is the story of Kubera and Beggar the same

కథ వరకూ చెప్పాలంటే….దరిద్రుడు స్థాయి నుంచి ఐశ్వర్యవంతుడి దశకి ఓ వ్యక్తి ఎలా చేరుకున్నాడు అనే కంటెంట్ ఎన్నోసార్లు, ఎన్నో లాంగ్వేజెస్ లో వచ్చిందే. అదెప్పుడూ ఎవర్ గ్రీన్. పైగా వీర పాప్యులారిటీని సంపాదించుకున్న ఏ హీరో చేసినా జనాలు బాగా ఎంజాయ్ చేసే కంటెంట్ కూడా ఇది. ఒక హీరో డేట్స్ లభ్యమైనప్పుడు నిర్మాతల ఒత్తిడి మీద ఒక దర్శకుడు కథను తయారు చేసుకోవాలంటే ఇంత కన్నా మంచి ఫార్ములా మరొకటి లేదు. ఫేన్స్ అండ్ ఆడియన్స్ సదరు పాప్యులర్ హీరో పూర్ టు రిచ్ స్టేజ్ లోకి వెళ్ళే ప్రయాణాన్ని, అందులో జరిగే కెమిస్ట్రీ, ఫిజిక్స్ తో కలిపి ప్రతీ పాయంట్ నీ బాగా ఎక్సైటింగ్ గా పీలవుతారు. అదే కుబేరకి కూడా జరిగిందిన అంటున్నారు.

దాదాపు 120 కోట్ల బిజినెస్ ఉన్న ధనుష్ డేట్స్ కుదిరినప్పుడు నిర్మాతలు శేఖర్ కమ్ములను దర్శకుడిగా ఎంపిక చేసుకుని కథ తయారుచేయమంటే పూర్ టు రిచ్ కధే కరెక్టు అని శేఖర్ అనుకోవడంతోనే కుబేర ప్రారంభమైంది. తను రాసుకున్న కథకి థనుష్ కాదు, ధనుష్ కి రాసుకున్న కధ ఇది అని అంటున్నారు. పైగా శేఖర్ కమ్ములకి లేని అలవాటు. నిర్ణీతకాలంలో షూటింగ్ పూర్తిచేయడం. శేఖర్ కొంచెం సావకాశంగా, సావధానంగా చేసే టైపు. ఇక్కడ అది కుదరలేదు. జనవరి 18 నుంచి ఏప్రిల్ 15 వరకే ధనుష్ డేట్స్ ఉన్నాయట. ఇంతలో పూర్తి చేయకపోతే మళ్ళీ ధనుష్ డిసెంబర్ వరకూ దొరికే అవకాశమే లేదు. అందుకని శేఖర్ కూడా ఇంటాక్ట్ గా చేయాల్సివస్తోందని ఇండస్ట్రీ టాక్.

నాగార్జున వరకూ వస్తే…..నాగార్జున క్యారెక్టరే అత్యంత కీలకమైన ఎలిమెంట్ కుబేరలో అని చెబుతున్నారు. ధనుష్ ఓ డాన్ గా ఎదిగి, మరో డాన్ తో తలపడే పరిస్థితులు వచ్చినప్పుడు….ఆ ఇద్దరినీ హేండిల్ చేసే ఓ టఫ్ క్యారెక్టర్లో నాగార్జున ప్రధానమైన భూమికనే పోషిస్తున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా, హిట్ ఫార్ములా, హిట్ కాంబినేషన్. ధనుష్ బ్రహ్మాండమైన మార్కెట్ లో ఉన్నాడు. నాగార్జున కూడా నా సామిరంగా హిట్ తో ట్రెండింగ్ లో రన్ అవుతున్నారు. కాబట్టి, కుబేర విజయానికి కుబేర యంత్రం పెట్టినట్టే.