iDreamPost
android-app
ios-app

రజినీకాంత్ పాత్ర అదేనా?

  • Published Mar 31, 2024 | 1:30 PM Updated Updated Mar 31, 2024 | 1:31 PM

తాజా ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజినీకాంత్ మాఫియా డాన్‌గా కనిపిస్తారని గట్టి టాక్ నడుస్తుంది. వివిధ దేశాల నుండి భారతదేశంలోకి అక్రమ రవాణా మార్గాల ద్వారా బంగారం రవాణా చేసే ఒక గ్యాంగ్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందట. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో రజినీ నెగెటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడమే.

తాజా ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజినీకాంత్ మాఫియా డాన్‌గా కనిపిస్తారని గట్టి టాక్ నడుస్తుంది. వివిధ దేశాల నుండి భారతదేశంలోకి అక్రమ రవాణా మార్గాల ద్వారా బంగారం రవాణా చేసే ఒక గ్యాంగ్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందట. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో రజినీ నెగెటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడమే.

  • Published Mar 31, 2024 | 1:30 PMUpdated Mar 31, 2024 | 1:31 PM
రజినీకాంత్ పాత్ర అదేనా?

సూపర్ స్టార్ రజినీకాంత్ 171వ సినిమా (Thalaivar171) స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. మాములు గానే రజినీ సినిమా అంటే ఒక హైప్ ఉంటుంది. ఇక లోకేష్ వంటి టాలెంటడ్ డైరెక్టర్ తో సినిమా అంటే మరిన్ని అంచనాలు పెరగడం ఖాయం. కాగా గత సంవత్సరం చూసుకుంటే అటు రజనీకాంత్ ఇటు లోకేష్ కనగరాజ్‌ ఇద్దరికీ భారీ విజయాలు దక్కాయి. రజినీకాంత్ జైలర్‌ వంటి బ్లాక్‌బస్టర్ ను అందించగా, లోకేష్ దర్శకత్వం వహించిన లియో, 2023లో కోలీవుడ్ ఇండస్ట్రీకి రెండవ అతి పెద్ద బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు, వీరిద్దరూ మొదటిసారిగా తలైవర్171 కోసం కలిసి పనిచేయనున్నారు కాబట్టి ఈ సినిమా చుట్టూ భారీ బజ్ ఉంది.

తాజా ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజినీకాంత్ మాఫియా డాన్‌గా కనిపిస్తారని గట్టి టాక్ నడుస్తుంది. వివిధ దేశాల నుండి భారతదేశంలోకి అక్రమ రవాణా మార్గాల ద్వారా బంగారం రవాణా చేసే ఒక గ్యాంగ్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందట. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో రజినీ నెగెటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడమే. ఈ వార్త ఆయన అభిమానుల్లో ఉత్కంఠను నింపింది. ఇటీవల రిలీజ్‌ చేసిన ఫస్ట్‌లుక్‌ ఇంటర్నెట్‌లో హంగామా చేసింది. లోకేష్ కనగరాజ్ రజనీని సూపర్బ్ లుక్ లో చూపించారు. కాగా ఈ సినిమా నుండి మరిన్ని అప్‌డేట్‌ల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Is that Rajinikanth's role

జూన్ 2024లో తలైవర్171ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, సన్ పిక్చర్స్ సంస్థ నిర్మాణ భాద్యతలను చూసుకుంటుంది. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేనప్పటికీ… ఖచ్చితంగా భారీ స్టార్ కాస్ట్ ఉంటుందని అంటున్నారు. గతంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో ఒక అతిధి పాత్రలో కనిపిస్తారని వార్తలు వచ్చినా అవేవీ నిజం కాలేదు.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş