iDreamPost
android-app
ios-app

Thalapathy Vijay: విజయ్‌తో త్రివిక్రమ్ సినిమా?

  • Published Feb 17, 2024 | 1:40 PM Updated Updated Feb 17, 2024 | 1:55 PM

తమిళ స్టార్ హీరో విజయ్, టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో ఓ పొలిటికల్ మూవీ రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. విజయ్ 69వ సినిమానే తన చివరి సినిమా అవడంతో ఆ సినిమా ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయం పై ఇప్పటికే పలు పుకార్లు వచ్చాయి.

తమిళ స్టార్ హీరో విజయ్, టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో ఓ పొలిటికల్ మూవీ రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. విజయ్ 69వ సినిమానే తన చివరి సినిమా అవడంతో ఆ సినిమా ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయం పై ఇప్పటికే పలు పుకార్లు వచ్చాయి.

  • Published Feb 17, 2024 | 1:40 PMUpdated Feb 17, 2024 | 1:55 PM
Thalapathy Vijay: విజయ్‌తో  త్రివిక్రమ్ సినిమా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ అయిన రాజమౌళి – సుకుమార్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే మాటల మాంత్రికుడిగా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న త్రివిక్రమ్ మాత్రం తెలుగు సినిమాల వరకే తన సత్తా చాటగలిగారు. మొత్తంగా కెరీర్ లో చూసుకుంటే ఆయన ట్రాక్ రికార్డ్ కూడా స్థిరంగానే ఉంది. అయితే ఈ ఏడాది సంక్రాంతికి మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం అంచనాలను అందుకోలేకపోయింది.

తాజాగా తమిళ సోషల్ మీడియా సర్కిల్స్ లో త్రివిక్రమ్ ఒక పొలిటికల్ సినిమాని తమిళ స్టార్ హీరో విజయ్ తో తీస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. విజయ్ 69వ సినిమానే తన చివరి సినిమా అవడంతో ఆ సినిమా ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయం పై ఇప్పటికే పలు పుకార్లు వచ్చాయి. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. విజయ్ ప్రస్తుతం తన 68వ చిత్రం GOAT షూటింగ్లో బిజీగా ఉన్నారు. కాగా వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకుడు. తన కెరీర్ లో ఇంతవరకూ త్రివిక్రమ్ ఇతర భాషా స్టార్ హీరోతో ద్విభాషా చిత్రం చేయలేదు. ఒకవేళ నిజంగానే తన పొలిటికల్ ఎంట్రీకి ముందు చివరి సినిమాను విజయ్, త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తే అది ఖచ్చితంగా ఇంటరెస్టింగ్ న్యూస్ అవుతుంది.

కమర్షియల్ సినిమా తీయగల సత్తా త్రివిక్రమ్ కు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ విజయ్ అభిమానులు కోరుకునే సినిమా ఆయన తీయగలరా? అని కొంత మంది సినీ ప్రేమికులు అనుమానంలో ఉన్నారు. అసలు ఈ కాంబినేషన్ నిజంగానే అటు విజయ్ లేదా ఇటు త్రివిక్రమ్ పరిశీలనలో ఉందా అని మరో వాదన వినిపిస్తోంది. గతంలోకి వెళితే త్రివిక్రమ్ ఒక హీరో పొలిటికల్ ఎంట్రీకి ముందు తీసిన సినిమా అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమలోనే పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది ఆ సినిమా. మరిప్పుడు నిజంగానే త్రివిక్రమ్ – విజయ్ సినిమా కనుక వస్తే ఎలాంటి సినిమా తీస్తారో అని తెలుగు సినిమా అభిమానులతో విజయ్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss