iDreamPost
android-app
ios-app

ఇకపై అందాల గేట్లు ఎత్తేయడానికి రెడీ అయ్యిందా..?

  • Author ajaykrishna Published - 05:56 PM, Tue - 4 July 23
  • Author ajaykrishna Published - 05:56 PM, Tue - 4 July 23
ఇకపై అందాల గేట్లు ఎత్తేయడానికి రెడీ అయ్యిందా..?

ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ ఎంట్రీ ఎంత గ్రాండ్ గా ఉంటుందో.. కెరీర్ అందుకు పూర్తి భిన్నంగా సాగుతుంది. ముందు హిట్ కొట్టినవారు.. తర్వాత ఒకే ఒక్క హిట్ అంటూ ప్లాపులు మూటగట్టుకుంటారు. మరికొందరు ముందే ప్లాపులు పడినా.. తమ గ్లామర్ తో అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఏదొక విధంగా ఫామ్ కొనసాగించే ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే.. ఈ రెండు రకాలు కాకుండా మూడో రకం వాళ్లు కూడా ఉంటారు. వాళ్లు గ్లామర్ షో చేయకపోయినా, వరుస ప్లాపులు ఎదురైనా అవకాశాలు వస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బ్యూటీ ఈ కోవకు చెందుతుంది.

ఉప్పెన మూవీతో బ్లాక్ బస్టర్ డెబ్యూ చేసిన యంగ్ బ్యూటీ కృతిశెట్టి అలియాస్ బేబమ్మ. మొదటిలో సినిమాలు హిట్టు పడేసరికి అమ్మడికి వద్దన్నా అవకాశాలు వచ్చి పడ్డాయి. సరే అవకాశాలు వస్తున్నప్పుడు, హీరోలు ఎవరు అని చూడకుండా కథలు, క్యారెక్టర్స్ ఎంపికలో జాగ్రత్తపడితే బాగుండేది. కానీ.. బేబమ్మ అలా చేయలేదు. అవకాశాలు వస్తున్నాయని అన్ని ఓకే చేసుకుంటూ పోయింది. కట్ చేస్తే.. చేతిలో అరడజను ప్లాపులు. అయినా ఇంకా చేతిలో చేసుకోవడానికి సినిమాలైతే అరకొరగా ఉన్నాయి. అయితే.. వీలైనంత త్వరగా ప్లాప్స్ నుండి బయటపడాలని కొత్త ప్లాన్ వేస్తుందట బేబమ్మ.

ప్రెజెంట్ కెరీర్ ఉన్న డౌన్ లో.. ఖచ్చితంగా ఉప్పెన లాంటి బ్రేక్ ఎంతైనా అవసరం ఉంది. సో.. సాదాసీదా రోల్స్ కాకుండా ఇకపై గ్లామర్ విషయంలో తెగించాలని, అందాలకు అడ్డుతెర తొలగించి అవకాశాలు అందుకోవాలని ఆలోచన చేస్తోందట. ఈ విషయాన్నీ కృతి స్వయంగా చెప్పలేదు. కానీ.. రీసెంట్ గా తన ఫోటోషూట్స్ లో ఒలికిస్తున్న గ్లామర్ ద్వారా హింట్ ఇస్తుందని టాక్. కమర్షియల్ సినిమాలు చేస్తే హీరోయిన్ రోల్స్ సాంగ్స్, గ్లామర్ వరకు పరిమితం అవుతాయి. ఇన్నాళ్లు అంటే గ్లామర్ షో చేయకపోయినా నడిచింది. కానీ.. ఇకపై అలా కాకుండా మళ్లీ తిరిగి బిజీ కావాలంటే.. స్కిన్ షోతో పాటు ముద్దు సన్నివేశాలు కూడా ఓకే చేస్తే బాగుంటుందని చూస్తుందట. లేదంటే చిన్న వయసులోనే కెరీర్ కి ఫుల్ స్టాప్ పడే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం అమ్మడు టివినో థామస్, శర్వానంద్ లతో సినిమాలు చేస్తోంది. మరి త్వరలోనే ఏదైనా సర్ప్రైజ్ ఇస్తుందేమో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Krithi Shetty (@krithi.shetty_official)