iDreamPost
android-app
ios-app

హనుమాన్‌కి పోటీనే ప్లస్ అయ్యిందా? ఇదీ నిజమైన ప్రమోషన్!

స్టార్‌ హీరోల సినిమాల నుంచి హనుమాన్‌కు గట్టి పోటీ తప్పదు. అయినప్పటికి దర్శకుడు, నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సంక్రాంతికే వస్తామని అంటున్నారు.

స్టార్‌ హీరోల సినిమాల నుంచి హనుమాన్‌కు గట్టి పోటీ తప్పదు. అయినప్పటికి దర్శకుడు, నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సంక్రాంతికే వస్తామని అంటున్నారు.

హనుమాన్‌కి పోటీనే ప్లస్ అయ్యిందా? ఇదీ నిజమైన ప్రమోషన్!

హనుమాన్‌ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీనుంచి వచ్చిన ప్రతీ అప్‌డేట్‌ ఆ అంచనాలను పెంచుతూ పోయింది. తాజాగా విడుదల అయిన ట్రైలర్‌తో అంచనాలు ఆకాశానికి చేరాయి. హనుమాన్‌ మూవీ విడుదలకు కేవలం పది రోజులు మాత్రమే సమయం ఉంది. జనవరి 12వ తేదీన మూవీ విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

అయితే, హనుమాన్‌ విడుదల తేదీ విషయంలో గత కొంత కాలం నుంచి వివాదం నడుస్తోంది. ఈ సంక్రాంతికి స్టార్‌ హీరోల సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. మహేష్‌ బాబు, వెంకటేష్‌, రవితేజ చిత్రాలు క్యూలో ఉన్నాయి. గుంటూరు కారం జనవరి 12వ తేదీన.. ‘సైంధవ్‌’ జనవరి 13వ తేదీన.. ‘ఈగల్‌’ సినిమా కూడా 13వ తేదీనే విడుదల కానుంది. దీంతో వివాదం మొదలైంది. సంక్రాంతికి పెద్ద సినిమాలు.. పెద్ద హీరోల సినిమాలు వస్తున్నందున రిలీజ్‌ డేట్‌ వాయిదా వేసుకోమని దర్శకుడు ప్రశాంత్‌ వర్మకు సూచన వెళ్లింది.

ప్రశాంత్‌ మాత్రం తాను వెనక్కు తగ్గనని తేల్చి చెప్పాడు. ప్రకటించిన తేదీకే విడుదల చేస్తామని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలోనే.. తమ సినిమా సంక్రాంతికి విడుదల కాకుండా కొందరు అడ్డుకుంటున్నారంటూ ప్రశాంత్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొంతమంది తనపై కోపంగా ఉన్నారని, దాన్ని తాను ఫేస్‌ చేస్తున్నానని చెప్పాడు. సెన్సార్‌ విషయంలో అడ్డంకులు వస్తే.. ఇన్‌ఫ్లుయెన్స్‌ ఉపయోగించి సాల్వ్‌ చేశానని తెలిపాడు అది ఎవరు క్రియేట్‌ చేశారో తెలీదని, ఎవరు ఆపాలని చూస్తున్నారో కూడా తెలీదని అన్నాడు. కొంతమంది అడ్డంకులు కలిగిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పాడు.

హనుమాన్‌కి పోటీనే ప్లస్ అయ్యిందా?

హనుమాన్‌ సినిమాకు ఇంత భారీ హైప్‌ రావటానికి ఒకరకంగా పోటీ సహకరించిందని చెప్పొచ్చు. ఎందుకంటే.. వివాదం కారణంగా హనుమాన్‌ గత కొంత కాలం నుంచి వార్తల్లో నిలుస్తోంది. నిత్యం మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. జనాల నోళ్లలో కూడా నానుతోంది.  సంక్రాంతికి స్టార్‌ హీరోల సినిమాలతో కాకుండా విడిగా వచ్చి ఉంటే ఇంత ప్రమోషన్‌ వచ్చి ఉండేది కాదు. ప్రేక్షకులు కూడా హనుమాన్‌ను పెద్దగా పట్టించుకునే వారు కాదు. ఇక, ఎంత కాదు అన్నా..

సంక్రాంతికి తెలుగునాట విడుదల అవుతున్న స్టార్‌ హీరోల సినిమాల ముందు హనుమాన్‌ చిన్న సినిమా.. స్టార్ల ముందు తేజ సజ్జ చిన్న హీరో.  ఈ పోటీ ప్లస్‌ అయి… హనుమాన్‌ స్టార్‌ హీరోల సినిమాలకు పోటీ వచ్చే సినిమాగా మారిపోయింది. మరి, హనుమాన్‌ సినిమాకు పోటీనే ప్లస్‌ అయిందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.