iDreamPost
android-app
ios-app

వెంటాడుతున్న వివాదం.. మళ్లీ సినిమా పోస్ట్‌పోన్‌ తప్పదా?..

విక్రమ్‌ సినిమా ధ్రువ నక్షత్రం నవంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే, అనుకోని విధంగా చిత్ర విడుదల మరోసారి పోస్టు పోన్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది...

విక్రమ్‌ సినిమా ధ్రువ నక్షత్రం నవంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే, అనుకోని విధంగా చిత్ర విడుదల మరోసారి పోస్టు పోన్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది...

వెంటాడుతున్న వివాదం.. మళ్లీ సినిమా పోస్ట్‌పోన్‌ తప్పదా?..

విలక్షణ నటుడు విక్రమ్‌- దర్శకుడు గౌతమ్‌ వాసు దేవ్‌ మీనన్‌ల కాంబోలో ‘ధ్రువ నక్షత్రం’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని దాదాపు రెండేళ్లు పైనే అయింది. అయినా ఇప్పటికీ విడుదల విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. విడుదలకు సిద్ధమైన ప్రతీ సారి అనుకోని విధంగా పోస్ట్‌ పోన్‌ అవుతూ వస్తోంది. తాజాగా చిత్ర బృందం సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది. నవంబర్‌ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది.

అయితే, ఇప్పుడు కూడా విడుదల వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. రేపు సినిమా థియేటర్లలోకి రావాల్సి ఉండగా.. ఇప్పుటి వరకు ఆన్‌లైన్‌లో బుకింగ్‌ ఓపెన్‌ అవ్వలేదు. దీంతో మరో సారి సినిమా విడుదలపై గందరగోళం నెలకొంది. ఆర్థిక లావాదేవీల కారణంగా ధ్రువ నక్షత్రం గత కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. చిత్ర బృందం సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో ఆర్థిక కష్టాలు తీరాయని అందరూ భావించారు. కానీ, ఇప్పుడు మళ్లీ ఆ వివాదం తెరపైకి వచ్చింది.

సినిమాను విడుదల చేయించాలన్న ఉద్ధేశ్యంతో కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వచ్చారట. తాము డబ్బులు ఇస్తామని, సినిమాను టేక్‌ ఓవర్‌ చేసి రిలీజ్‌ చేయమని గౌతమ్‌ మీనన్‌ను చెప్పారట. ఇందుకు గౌతమ్‌ మీనన్‌ ఒప్పుకోలేదట. దీంతో సినిమా విడుదల ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాను చెప్పిన టైంకు రిలీజ్‌ చేయడానికి గౌతమ్‌ మీనన్‌ నానా కష్టాలు పడుతున్నారట. దర్శకుడు సినిమా విడుదల కోసం ఇంత కష్టపడుతుంటే.. హీరో విక్రమ్‌ మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారట.

ధ్రువ నక్షత్రం విడుదలపై ఇప్పటి వరకు ఆయన ఎలాంటి పోస్టు పెట్టక పోవటం నెటిజన్లు ఆగ్రహానికి గురి చేస్తోంది. ఇక, ధ్రువ నక్షత్రం సినిమా గురించి తాజా ఇంటర్వ్యూలో గౌతమ్‌ వాసు దేవ్‌ మీనన్‌ మాట్లాడుతూ.. ‘‘ సినిమాను నవంబర్‌ 24న రిలీజ్‌ చేయడానికి సిద్ధం చేశాం. మామూలుగా అయితే, 21వ తేదీనే ప్రింట్‌లు బయటకు వెళ్లాలి. ఇంతకు కొద్దిరోజుల ముందే సినిమాకు అన్ని విషయాలు చెక్‌ చేసుకుంటాము. ఇప్పటి వరకు అన్ని సినిమాలకు ఇలానే చేసుకుంటూ వస్తున్నాము.

కానీ, ధ్రువ నక్షత్రం సినిమా విషయంలో అలా జరగలేదు. ఈ సారి సినిమా సిద్ధంగా ఉంది. సెన్సార్‌ కూడా అయింది. కాపీ కూడా రెడీగా ఉంది. టెక్నికల్‌ పనులు కూడా అయిపోయాయి. ఇవన్నీ నెలరోజుల క్రితమే అయిపోయాయి’’ అని అన్నారు. మరి, ధ్రువ నక్షత్రం మళ్లీ పోస్ట్‌ పోన్‌ కాబోతోందని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.