iDreamPost
iDreamPost
IPL 2022 సీజన్‌లో ఇవాళ గుజరాత్ టైటాన్స్ కి, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకి మధ్య మ్యాచ్. బెంగుళూరు టీం మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా సరైన ఫామ్ లో లేడు. ఈ ఐపీఎల్ లో కూడా రెండు రనౌట్లు, రెండు డకౌట్స్, ఓ సింగిల్ డిజిట్ స్కోరు. అసలే కోహ్లీ సెంచరీ కొడితే చూద్దామని ఎప్పట్నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ సెంచరీ పక్కన పెడితే ఇప్పుడు కోహ్లీ ఫామ్ లో లేకపోవడం మరింత బాధ కలిగిస్తుంది అభిమానులకి, క్రికెట్ ప్రేమికులకి.
ఇవాళ్టి మ్యాచ్ లో ఈ విమర్శలన్నిటికి సమాధానం చెప్పాడు విరాట్. గుజరాత్ తో జరుగుతున్న మ్యాచ్ లో బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండో ఓవర్‌లోనే కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ డకౌట్ అవ్వడంతో విరాట్, యంగ్ ప్లేయర్ రజత్ పటిదార్‌తో కలిసి గ్రౌండ్ లో దుమ్ము దులిపాడు. 45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు విరాట్. మొత్తంగా 53 బంతుల్లో 58 రన్స్ కొట్టాడు.
ఐపీఎల్ కెరీర్‌లో విరాట్ కోహ్లీకి ఇది 43వ హాఫ్ సెంచరీ. అలాగే ఈ ఇన్నింగ్స్‌లో కొట్టిన రెండు సిక్సర్లతో టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్ మెన్ గా రెండో స్థానంలో నిలిచాడు విరాట్ కోహ్లీ. ఇవాళ ప్రస్తుత టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టినరోజు. ప్రముఖులు రోహిత్ కి విషెస్ చెబుతున్నారు. రోహిత్ కూడా ఫామ్ లో లేడు, నెటిజన్లు కోహ్లీ ఫామ్ లోకి వచ్చాడు, రోహిత్ పుట్టిన రోజుకి గిఫ్ట్ గా హాఫ్ సెంచరీ చేశాడు. ఇక రోహిత్ కూడా ఫామ్ లోకి వస్తాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్ లో విరాట్ కి మరో ఎండ్‌లో ఉన్న రజత్ పటిదార్ 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసి విరాట్ కి సపోర్ట్ ఇచ్చాడు. పటిదార్‌కి ఇదే మొదటి హాఫ్ సెంచరీ. ఈ మ్యాచ్ లో బెంగుళూరు 20 ఓవర్లకి 170 పరుగులు చేసి ఆరు వికెట్లని కోల్పోయింది.