iDreamPost
android-app
ios-app

రజినీ దత్త తండ్రి సర్వర్ అని తెలుసా? ఆయన గురించి తెలిస్తే హ్యాట్పాఫ్ అంటారు!

  • Published Aug 14, 2024 | 2:54 PM Updated Updated Aug 14, 2024 | 2:54 PM

Superstar Rajinikanth: సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకొని కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు రజినీకాంత్. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడి నటిస్తున్నారు. రజినీకాంత్ కి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ న్యూస్ ఏంటో తెలుసుకుందాం..

Superstar Rajinikanth: సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకొని కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు రజినీకాంత్. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడి నటిస్తున్నారు. రజినీకాంత్ కి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ న్యూస్ ఏంటో తెలుసుకుందాం..

రజినీ దత్త తండ్రి సర్వర్ అని తెలుసా? ఆయన గురించి తెలిస్తే హ్యాట్పాఫ్ అంటారు!

భారతీయ చలన చిత్రం రంగంలో చాలా కొద్దిమంది మాత్రమే సూపర్ స్టార్ గా గొప్ప పేరు సంపాదించారు. అలాంటి వారిలో రజినీకాంత్ ఒకరు. ఒక సామన్య బస్ కండెక్టర్ జీవితాన్ని ప్రారంభించి ఇప్పుడు ప్రపంచం గుర్తించిన సూపర్ స్టార్ గా వెలిగిపోతున్నారు. రజినీకాంత్ నటించిన సినిమాలు భారత్ లోనే కాదు మలేషియా, సింగపూర్, జపాన్, అమెరికాలో రిలీజ్ అయి కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. ఇంత పేరు ప్రఖ్యాతలు ఉన్న రజినీకాంత్ గొప్ప సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. తన కోట్ల సంపాదనలో పేద ప్రజలకు దాన ధర్మాలు చేస్తుంటారు. తాజాగా రజినీకాంత్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కరలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు కోట్ల మంది అభిమానులు ఉన్నారు. రజినీకాంత్ సినిమా రిలీజ్ కోసం వెయ్యి కళ్లతో ఎదుచూస్తుంటారు. రజినీకాంత్ హీరోగానే కాదు.. సామాజిక సేవకుడు. ప్రకృతి విపత్తులు వచ్చినపుడు భారీ విరాళాలు ఇస్తుంటారు.. ప్రత్యేక్షంగా అక్కడికి వెళ్లి వారి కష్టాలు అడి తెలుసుకొని తన వంతు సాయం అందిస్తారు. రజినీకాంత్ ఓ వృద్డుడిని తండ్రిగా దత్తత తీసుకున్న విషయం కొద్దిమందికే తెలుసు.ఆ వృద్దుడిని రజినాకాంత్.. ఎప్పుడు నాన్న ని పిలుస్తారట. విచిత్రం ఏంటంటే ఆ వృద్దుడిని తన ఇంటింకి తీసుకువెళ్లాలని ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలం పొందారట. అదేంటీ రజినీకాంత్ తో ఒక్క సెల్ఫీ దిగితే చాలురా నాయనా అని సామాన్యేలే కాదు సెలబ్రెటీలు కూడా కోరుకుంటారు. కానీ ఆ వృద్దుడు రజినీకాంత్ పిలుపును తిరస్కరించాడు.. ఆయనలో అంత ప్రత్యేకత ఏముందీ? అన్న అనుమానాలు కలుగుతాయి. నిజమే ఆయన ఓ ప్రత్యేకమైన వ్యక్తి అంటున్నారు.

Superstar Rajinikanth adapted father

రజినీకాంత్ దత్తత తీసుకున్న వృద్దుడి పేరు పాలెం కళ్యాణ సుందరం. ఒకప్పుడు లైబ్రేరియన్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. 30 ఏళ్ల సర్వీసులో తన మొత్తం సంపాదన దాన ధర్మాలు చేస్తూ వచ్చారు. తనకంటూ ఏదీ మిగుల్చుకోలేదు. తనకు వచ్చిన రూ.10 లక్షల పెన్షన్ కూడా ఓ ఛారిటీ సంస్థకు దానంగా ఇచ్చారు. నిస్వార్థపరుడైన కళ్యాణ సుందరం అంటే అక్కడ అందరూ ఎంతో గౌరవం ఇస్తారు. ఆయన సేవలు గుర్తించి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ 20వ శతాబ్దపు అత్యుత్తమ వ్యక్తుల్లో ఒకరిగా గౌరవించారు. కళ్యాణ సుందరం గురించి తెలుసుకున్న రజినీ ఆయన్ని దత్తత తీసుకొని నాన్న అని పిలవడం మొదలు పెట్టారట. ఎన్నిసార్లు తన ఇంటికి రమ్మని అడిగినా తాను మాత్రం వెళ్లేవాడు కాదని పలు సందర్భాల్లో రజినీ అన్నారు. సాదా సీదా జీవితానికి అలవాటు పడ్డ కళ్యాణ సుందరం లగ్జరీ లైఫ్ అంటే ఇష్డపడేవాడు కాదని అందుకే రజినీకాంత్ ఆఫర్ ని తిరస్కరించేవారని అంటారు. కళ్యాణ్ సుందరం 10 సంవత్సరాల పాటు ఓ హూటల్ లో సర్వర్ గా పనిచేశారట. ఆయన నిస్వార్థ సేవలు, గుణం చూసి రజినీ కాంత్ ఇంప్రెస్ అయి దత్తత తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రజినీకాంత్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టైయాన్ టైటిల్ తో ఓ మూవీలో నటిస్తున్నారు.