iDreamPost
android-app
ios-app

మా నాన్న ఎవ్వరికీ ముద్దులు పెట్టొద్దు అన్నారు! అది మాత్రం ఓకే: హీరోయిన్

  • Published Apr 15, 2024 | 1:03 PM Updated Updated Apr 15, 2024 | 1:03 PM

సోషల్ మీడియా లో ఫన్నీ వీడియోస్, రీల్స్ చేస్తూ ఇప్పుడు ఎంత మంది ఫేమస్ అవుతున్నారో చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలోనే వారు ఫేమస్ అవుతూ.. క్రమంగా వెండి తెర అరంగేట్రం కూడా చేసేస్తున్నారు. తాజాగా ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సెర్ తన సినిమాల గురించి ఇలా చెప్పుకొచ్చింది.

సోషల్ మీడియా లో ఫన్నీ వీడియోస్, రీల్స్ చేస్తూ ఇప్పుడు ఎంత మంది ఫేమస్ అవుతున్నారో చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలోనే వారు ఫేమస్ అవుతూ.. క్రమంగా వెండి తెర అరంగేట్రం కూడా చేసేస్తున్నారు. తాజాగా ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సెర్ తన సినిమాల గురించి ఇలా చెప్పుకొచ్చింది.

  • Published Apr 15, 2024 | 1:03 PMUpdated Apr 15, 2024 | 1:03 PM
మా నాన్న ఎవ్వరికీ ముద్దులు పెట్టొద్దు అన్నారు! అది మాత్రం ఓకే:  హీరోయిన్

సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ సర్వైవ్ అవ్వడం అంటే సాహసం అనే చెప్పాలి. ఇప్పుడైతే ప్రతి ఒక్కరు చాలా ఈజీగా డెబ్యూ ఫిలిమ్స్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలంటే మాత్రం స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ చూసుకునేవారు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీని ఏలేస్తున్న ఎంతో మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు అందరూ కూడా.. అలా ఇండస్ట్రీకి వచ్చి.. కష్టపడి పేరు సంపాదించుకున్న వారే. కానీ, ఇప్పుడున్న జెనెరేషన్ వారు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన తర్వాత సినిమా ఛాన్సులు కొట్టేస్తున్నారు. ఇక ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా.. యుట్యూబ్ లో వ్లాగ్స్ ద్వారా తమ టాలెంట్ ను కనబరుస్తూ.. అందరిని ఇంప్రెస్స్ చేసేస్తున్నారు. వారిలో కొంతమందైతే ఏకంగా సినిమాలలో ఛాన్స్ లో కొట్టేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో ఫిట్ చెక్ పేరుతో వీడియోస్ చేసే.. ప్రీతి పగడాల కూడా ఈ కోవకు చెందింతే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. తన డెబ్యూ ఫిల్మ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు చెప్పుకొచ్చింది.

సోషల్ మీడియా పుణ్యమా అని.. చాలా మంది వీడియోస్ చేస్తూ తెగ ఫేమస్ అయిపోతున్నారు. ముఖ్యంగా మన తెలుగు అమ్మాయిలకు మంచి ఫాలోయింగ్ ఏ వస్తుంది. కొంతమంది సోషల్ మీడియా నుంచి.. బుల్లితెర టీవీ షోస్ కు వస్తుంటే.. మరికొంతమంది ఏకంగా వెండితెరపై కనిపించేస్తున్నారు. పైగా వారిలో కొంతమందికి సినిమా ఆఫర్లు కూడా వరిస్తున్నాయి. దీనితో ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు మంచి ఛాన్స్ దక్కుతుంది. ఇంస్టాగ్రామ్ లో కోడిగుడ్డు మోటివేషన్, ఫిట్ చెక్ పేరుతో.. వీడియోస్ చేసి పాపులర్ అయినా ప్రీతీ పగడాల కూడా ఈ కోవకు చెందిందే. ఈ అమ్మడు ఇంస్టాగ్రామ్ లో రకరకాల డ్రెస్సెస్ వేసుకుంటూ.. ఫిట్ చెక్ అంటూ వీడియోస్ చేస్తుంది. ముఖ్యంగా ఈమె.. తన అమెరికన్ యాక్సెంట్ లో క్యూట్ గా మాట్లాడుతూ.. అందరిని ఇంప్రెస్ చేసేసింది. సోషల్ మీడియాలో ఈమెకు ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు త్వరలో వెండితెరపై కనిపించనుంది.. పతంగ్ అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తుందట ప్రీతీ పగడాల.

Preethi pagadaala

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ముచ్చటించిన ఈ అమ్మడు.. సినిమాలలో తన ఎంట్రీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ మాటలు చెప్పుకొచ్చింది. సినిమాలలో గ్లామరస్ , ఇంటిమేట్ సీన్స్ చేయడం పై మీ ఒపీనియన్ ఏంటి అని అడిగినపుడు.. ప్రీతీ మాట్లాడుతూ.. “నేను ఈ ఫీల్డ్ లోకి వస్తాను అన్నపుడు.. మా నాన్నగారు ఒక కండిషన్ పెట్టారు. గ్లామరస్ రోల్స్ ఓకే కానీ.. లిప్ లాక్ సీన్స్ మాత్రం చెయ్యొద్దు అన్నారు. ఆయన నాకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చి.. నాకోసం ఎన్నో చేశారు. కాబట్టి ఆయన కోసం నేను ఇది ఒక్కటి ఎందుకు చేయకూడదు అని డిసైడ్ అయ్యాను . అందుకే లిప్ లాక్ సీన్స్ కు నో చెప్తాను.” అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. ఏదేమైనా ఇలా తెలుగు వారిని ఎంకరేజ్ చేస్తూ వారికీ సినిమా అవకాశాలు కల్పిస్తూ ఉంటే మాత్రం.. ఇండస్ట్రీలో ముందు ముందు ఎంతో మంది మంచి హీరోయిన్స్ వస్తారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by IDream Media (@idreammedia)

 

View this post on Instagram

 

A post shared by Patang (@patangthefilm)

Jojobet GirişmeritbetmeritbetcasibomvbetcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetin