iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ బ్యూటీ ఇనయా షాకింగ్ కామెంట్స్.. షో వల్ల నష్టపోయానంటూ!

  • Published Aug 02, 2024 | 8:30 PM Updated Updated Aug 02, 2024 | 8:30 PM

Inaya Sultana On Bigg Boss Show And Opportunities: ఇనయా సుల్తానాకు బిగ్ బాస్ షో తర్వాత మంచి ఫేమ్, నేమ్ వచ్చింది అని అందరికీ తెలిసిందే. అయితే బిగ్ బాస్ షో వల్ల అవకాశాలు చాలా కోల్పోయాను అంటూ ఆమె కామెంట్ చేయడం వైరల్ గా మారింది.

Inaya Sultana On Bigg Boss Show And Opportunities: ఇనయా సుల్తానాకు బిగ్ బాస్ షో తర్వాత మంచి ఫేమ్, నేమ్ వచ్చింది అని అందరికీ తెలిసిందే. అయితే బిగ్ బాస్ షో వల్ల అవకాశాలు చాలా కోల్పోయాను అంటూ ఆమె కామెంట్ చేయడం వైరల్ గా మారింది.

  • Published Aug 02, 2024 | 8:30 PMUpdated Aug 02, 2024 | 8:30 PM
బిగ్ బాస్ బ్యూటీ ఇనయా షాకింగ్ కామెంట్స్.. షో వల్ల నష్టపోయానంటూ!

బిగ్ బాస్ అనేది ఇప్పుడు తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో బిగ్గెస్ట్ రియాలిటీ షో. ఈ షోకి వెళ్లేందుకు ఎంతో మంది సెలబ్రిటీలు ఉవ్విళ్లూరుతూ ఉంటారు. కొత్తగా కెరీర్ మొదలు పెట్టిన వాళ్లు.. కెరీర్ డౌన్ లో ఉన్నవాళ్లు సెకండ్ ఇన్నింగ్స్ గాడిలో పెట్టుకోవడానికి కూడా ఈ షోకి వెళ్లాలి అనుకుంటారు. ఈ షోకి వెళ్లిన వాళ్లు లైమ్ లైట్ లోకి వస్తారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే షో వల్ల నష్టపోయాం అని చెప్పేవాళ్లు కూడా లేకపోలేదు. ఇప్పటికే చాలామంది ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అలాంటి జాబితాలోకి ఇప్పుడు బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా చేరింది. తాను బిగ్ బాస్ షో వల్ల నష్టపోయాను అంటూ కామెంట్స్ చేసింది.

ఇనయా సుల్తానా నటిగా తన కెరీర్ ని గాడిలో పెట్టుకోవాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ, బిగ్ బాస్ కి వచ్చిన తర్వాతే ఆమెకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. అలాగే ఒక మంచి సెలబ్రిటీ హోదా కూడా లభించింది. నటిగానే కాకుండా.. ఇన్ ఫ్లుఎన్సర్ గా కూడా రాణిస్తోంది. తాజాగా అశ్విన్ బాబు చేసిన శివమ్ భజే చిత్రంలో కీలక పాత్రలో మెరిసింది. ఫారెన్ సిక్ ఎక్స్ పర్ట్ గా కేసును సాల్వ్ చేసే ప్రక్రియలో తన నటనతో మెప్పించింది. శివమ్ భజే మూవీకి సంబంధించి ఇంటర్వ్యూల్లో కూడా పాల్గొంటోంది. తాజాగా ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇనయా సుల్తానా కీలక వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ షో వల్ల లాభం ఎంత ఉందో.. నష్టం కూడా అంతే ఉంది అనే తరహాలో ఆమె వ్యాఖ్యలు సాగాయి.

“బిగ్ బాస్ వాళ్లకు మేము ఇవ్వమండి ఛాన్సులు అని ముఖం మీద చెప్పిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఆఫీసుల్లో బిగ్ బాస్ అని చూడగానే ప్రొఫైల్ తీసి పక్కన పెట్టేస్తున్నారు. ఫస్ట్ లో అలా ఉండేది. నేను ఆడిషన్ ఇచ్చిన తర్వాత వెళ్లిపోకుండా. ఒక గంటసేపు వెయిట్ చేసి.. డైరెక్టర్ ని మీట్ అయ్యి నేను అందరూ అనుకున్నట్లు కాదు ఏ రోల్ ఇచ్చినా చేస్తాను. నాకు ఇంత రెమ్యూనరేషన్ కావాలి అని నేను ఎప్పుడూ డిమాండ్ చేయలేదు. నాకు ఇంత ఫేమ్ ఉంది.. నాకు ఇంత రెమ్యూనరేషన్ ఇవ్వండి అని అడగాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నాకు క్యారెక్టర్స్ కావాలి.. రెమ్యూనరేషన్ కాదు. వాళ్లు కన్విన్స్ అయ్యి నాకు మూవీ ఇవ్వడానికి కాస్త సమయం పట్టేది. కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు డిప్రెషన్ లోకి తీసుకెళ్తాను. అందుకే నేను ఇక్కడ ఉండకుండా వెళ్లిపోతూ ఉంటాను. నాకు ట్రావెల్ చేయడం అంటే ఇష్టం. ఎక్కువ సోలో ట్రిప్స్ వెళ్తూ ఉంటాను” అంటూ ఇనయా సుల్తానా చెప్పుకొచ్చింది. ఇనయా సుల్తానా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by tv5 entertainment (@tv5entertainment)

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet giriş