iDreamPost
android-app
ios-app

వీడియో: ప్రియుడిపై ప్రేమను ఒక్క పాటతో బయటపెట్టిన ఇనయా సుల్తానా!

  • Published Aug 23, 2024 | 4:16 PM Updated Updated Aug 23, 2024 | 4:16 PM

Inaya Sultana And Gautham Koppishetty: బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానాకు తెలుగులో మంచి ఫ్యాన్ బేసే ఏర్పడింది. ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా కూడా మారిపోయింది. ఈ అమ్మడు ఇప్పుడు తన ప్రియుడిపై ఉన్న ప్రేమను ఒక్క పాటలో చూపించింది.

Inaya Sultana And Gautham Koppishetty: బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానాకు తెలుగులో మంచి ఫ్యాన్ బేసే ఏర్పడింది. ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా కూడా మారిపోయింది. ఈ అమ్మడు ఇప్పుడు తన ప్రియుడిపై ఉన్న ప్రేమను ఒక్క పాటలో చూపించింది.

  • Published Aug 23, 2024 | 4:16 PMUpdated Aug 23, 2024 | 4:16 PM
వీడియో: ప్రియుడిపై ప్రేమను ఒక్క పాటతో బయటపెట్టిన ఇనయా సుల్తానా!

ఇనయా సుల్తానా.. ఈ అమ్మడు వెండితెర మీద తన మార్క్ చూపించేందుకు ఎంతో కృషి చేస్తోంది. ఇప్పుడిప్పుడే సరైన అవకాశాలు కూడా దక్కుతున్నాయి. ఇటీవల అశ్విన్ బాబు శివం భజే సినిమాలో యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. లీడ్ రోల్స్ లో కూడా ఈ బిగ్ బాస్ బ్యూటీ కనిపంచబోతోంది. ఇప్పటికే పలు ప్రాజెక్ట్స్ కూడా ఓకే చేసి.. షూటింగ్ స్టార్ట్ చేసింది. ఈమె ఇప్పుడు సినిమాలతోనే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతోంది. అందుకు కారణం ఆమె ప్రియుడు గౌతమ్ కొప్పిశెట్టి అని కూడా చెప్పచ్చు. తాజాగా తన ప్రియుడిపై తనకున్న ప్రేమను తెలియజేస్తూ ఒక రీల్ చేసింది. ఆ రీల్ కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

ఇనయా సుల్తానాకు బిగ్ బాస్ ద్వారా ఫేమ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ షోకి వెళ్లిన తర్వాత ఇనయాకి తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో క్రేజ్ పెరగడమే కాకుండా.. అవకాశాలు కూడా వచ్చాయి. అయితే ఆమె బిగ్ బాస్ వల్ల అవకాశాలు రాలేదు అంటూ చేసిన వ్యాఖ్యుల చూశాం. బిగ్ బాస్ అంటేనే ప్రొఫైల్ పక్కన పడేస్తారని చెప్పుకొచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కెరీర్ తోనే కాకుండా.. వ్యక్తిగత జీవితం విషయంలో కూడా ఇనయా సుల్తానాన వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల గోవా ట్రిప్పులో ఉండగా ఇనయా తన ప్రియుడిని ఫ్యాన్స్ కి పరిచయం చేసింది. అతని పేరు గౌతమ్ కొప్పిశెట్టి. అతను ఫిజికల్ ఎడ్యుకేషన్ లో మాస్టర్స్ చేశాడు. అలాగే లైఫ్ కోచ్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ప్రియుడిని పరిచయం చేసినప్పటి నుంచి వరుస పోస్టులు చేస్తూనే ఉంది. తాజాగా ఒక పాట రూపంలో తన ప్రేమను బయటపెట్టింది.

 

View this post on Instagram

 

A post shared by GAUTAM CHAKRADHAR KOPPISETTY (@gautamm_koppisetti)

ఇనయా సుల్తానా తన ప్రియుడు గౌతమ్ మీద ఉన్న ప్రేమను ఒక రీల్ రూపంలో బయటపెట్టింది. ఈ జంట ‘తూమిలే.. దిల్ ఖీలే’ అనే సాంగ్ కి రీల్ చేశారు. అందులో ఇద్దరూ బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ వేసుకుని.. ఒకరిని ఒకరు ఆప్యాయంగా కౌగిలించుకుని తమ ప్రేమను వ్యక్తపరుచుకున్నారు. నిజానికి అది ఒక రీల్ కావచ్చు. కానీ, ఇనయా- గౌతమ్ మధ్య ఉన్న బాండింగ్ కి ఆ రీల్ ఒక ఉదాహరణగా మారింది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అలాగే ఈ పెయిర్ ని చూసిన నెటిజన్స్ వారికి విషెస్ చెబుతున్నారు. మరి.. ఇనయా సుల్తానా- గౌతమ్ రీల్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Doulath sulthana (@inayasulthanaofficial)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet